'సలార్' లో చూపించిన ఖాన్సార్ నగరం ఎక్కడుందో తెలుసా?
భారీ అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సలార్' పార్ట్-1 సీజ్ ఫైర్' పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది
By: Tupaki Desk | 22 Dec 2023 4:38 PM GMTభారీ అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సలార్' పార్ట్-1 సీజ్ ఫైర్' పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. పార్ట్-1 చూసిన వాళ్లంతా సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే సలార్ రిలీజ్ తర్వాత ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఈ మూవీ కథ అంతా 'ఖాన్సార్' అనే నగరం చుట్టూ తిరుగుతుంది. అయితే సినిమా చూసిన వాళ్లంతా ఈ 'ఖాన్సార్' అనే నగరం నిజంగానే ఇండియాలో ఉందా? లేక సినిమా కోసం దీన్ని సృష్టించారా? అనే విషయాన్ని మాట్లాడుకుంటున్నారు.
అయితే సలార్ సినిమాలో చూపించిన ఖాన్సార్ నగరం నిజంగానే ఇండియాలో ఉంది. ఈ నగరం పాకిస్తాన్ - గుజరాత్ మధ్య ఉందని సినిమాలో చూపించారు. చూపించినట్టుగానే ఖాన్సార్ అనే నగరం ఉంది. కానీ సలార్ లో చూపించినట్లుగా కాకుండా ఇరాన్ లో ఖాన్సార్ కౌంటీ అనే నగరం ఉంది. ఇస్ఫాహాన్ ప్రావిన్స్ లో ఇది ఉంది. ఇక్కడ 22 వేలకు పైగా పర్షియన్లు నివాసం ఉంటున్నట్లు సమాచారం.
అయితే సలార్ సినిమాలో చూపించిన ఖాన్సార్ కి ఇరాన్ లో ఉన్న ఖాన్సార్ కౌంటి కి ఏమాత్రం పోలిక లేదు. సలార్ రిలీజ్ తర్వాత ఈ ఖాన్సార్ అనే పేరు తెరపైకి రావడంతో నిజంగానే ఈ నగరం ఉందా? అని అభిమానులు గూగుల్లో తెగ సర్చ్ చేస్తున్నారు. ఇక బాహుబలితో రాజమౌళి ఎలాగైతే సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాడో అలాగే ప్రశాంత్ నీల్ కూడా సలార్ తో ఖాన్సార్ అనే సామ్రాజ్యాన్ని రూపొందించాడు.
ఈ ఖాన్సార్ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవడం కోసం రకరకాల తెగలవారు ప్రయత్నిస్తారు. అందులో ప్రభాస్ ఒక తెగకి చెందినవాడు అయితే పృధ్విరాజ్ మరో తెగకి చెందినవాడు. ఇద్దరూ చిన్నప్పటినుంచి ఈ ప్రాణ స్నేహితులుగా ఉండి చివరికి బద్ధ శత్రువులుగా ఎలా మారారు? అనేది సలార్ సినిమా కథ. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన మేకింగ్ తో ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారు.
సినిమాలో ఈ డైరెక్టర్ డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు అందులో ప్రభాస్ ఊచ కోత నెక్స్ట్ లెవెల్ తో ఉండడంతో ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ సైతం ఈ సినిమాని థియేటర్స్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు పృధ్విరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు, బాబీ సింహ, శ్రియ రెడ్డి, ఈశ్వరి రావు కీలక పాత్రలు పోషించారు.