Begin typing your search above and press return to search.

సలార్ × కేజీఎఫ్.. మరో లింక్ పెట్టేశారు

సలార్ 2 మూవీ స్టొరీ క్లైమాక్స్ ని కేజీఎఫ్ 2కి కనెక్ట్ చేయడం ద్వారా మూవీ ఎండ్ చేస్తారంట.

By:  Tupaki Desk   |   30 Aug 2023 4:35 AM GMT
సలార్ × కేజీఎఫ్.. మరో లింక్ పెట్టేశారు
X

కేజీఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశారు. ఈ కేజీఎఫ్ సిరీస్ దేశ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్ తో భారీ కలెక్షన్స్ కి కొల్లగొట్టింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సిరీస్ రెండు భాగాలుగా చేస్తున్నారు. అందులో మొదటి పార్ట్ సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతోంది.

ఆదిపురుష్ లాంటి డిజాస్టర్ తర్వాత కూడా ప్రభాస్ క్రేజ్ విషయంలో ఎలాంటి మార్పు లేదని సలార్ చిత్రానికి జరుగుతున్న బిజినెస్ దీల్స్ చెబుతున్నాయి. ఇప్పటికే 500 కోట్ల వరకు బిజినెస్ డీల్ క్లోజ్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. విదేశాలలో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఓవర్సీస్ కోసం ఇంగ్లీష్ వెర్షన్ కూడా సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి తాజాగా కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. సలార్ సిరీస్ లో వచ్చే రెండు భాగాలు కేజీఎఫ్ లో భాగామేనంట. ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మాఫియా బ్యాక్ డ్రాప్ కథలన్నీ ఒకే ఫేజ్ లోకి తీసుకోస్తున్నారంట. సలార్ పార్ట్ 1లో ప్రభాస్ పాత్ర నిడివి ఎక్కువ ఉంటుందంట. అయితే పార్ట్ 2 లో మాత్రం పృధ్వీరాజ్ సుకుమారన్ పాత్రకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారంట.

సలార్ 2 మూవీ స్టొరీ క్లైమాక్స్ ని కేజీఎఫ్ 2కి కనెక్ట్ చేయడం ద్వారా మూవీ ఎండ్ చేస్తారంట. ప్రస్తుతం సౌత్ సర్కిల్ లో దీనిపై జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే ఈ వార్తలలో వాస్తవం ఎంత అనేది తెలియదు. గతంలో ఇలాంటి ప్రచారాలు చాలా సార్లు తెరపైకి వచ్చాయి. రాఖీభాయ్ సలార్ సిరీస్ లో గెస్ట్ రోల్ చేస్తున్నారంటూ కథనాలు ప్రసారం అయ్యాయి. అయితే వాటిలో ఎలాంటి వాస్తవం లేదని చిత్ర యూనిట్ తేల్చేసింది.

మరోసారి సలార్ రిలీజ్ ముందు అలాంటి ప్రచారమే తెరపైకి తీసుకొచ్చారు. ఏది ఏమైనా ఈ ప్రచారాలు అన్ని కూడా సలార్ మూవీ పబ్లిసిటీకి భాగా పనిచేస్తున్నాయి. సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని చిత్ర యూనిట్ అంచనా వేస్తుంది. అలాగే బాహుబలి సిరీస్ తర్వాత ఫ్యాన్స్ పూర్తిగా సలార్ మూవీ సంతృప్తి పరుస్తుందని భావిస్తున్నారు.