Begin typing your search above and press return to search.

సలార్ మేకింగ్ వీడియో రిలీజ్.. అంతలా కష్టపడ్డారా?

విడుదలైన తొలి షో నుంచి పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకున్న ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది

By:  Tupaki Desk   |   25 Dec 2023 1:51 PM GMT
సలార్ మేకింగ్ వీడియో రిలీజ్.. అంతలా కష్టపడ్డారా?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన సలార్ మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాహో, రాధే శ్యామ్‌, ఆదిపురుష్‌ వంటి వరుస పరాజయాల తర్వాత ప్రభాస్‌.. సినీ ఇండస్ట్రీకి మరోసారి తన సత్తా ఏంటో చాటి చెప్పారు. ప్రభాస్‌ స్టామినా ఏంటో ఈ సినిమా ద్వారా ప్రశాంత్ నీల్ చూపించారు.

విడుదలైన తొలి షో నుంచి పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకున్న ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఊహకందని వసూళ్లతో భారతీయ సినిమా ఇండస్ట్రీలో భారీ ఓపెనింగ్స్‌ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజులు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.402 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఓవర్సీస్ లో 5మిలియన్ల డాలర్ల మార్క్ చేరుకుందని తెలిపారు.

ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ఎలా తీశారనేది చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు వాళ్ల కోసమే అన్నట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సలార్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో ఫైట్ సీన్స్‌ ఎలా తీశారనేది చూపించింది. సినిమాను తెరకెక్కించేందుకు ఎంతలా కష్టపడ్డారో ఇందులో చూపించింది.

సినిమాలో హైలైట్‌గా నిలిచిన పలు యాక్షన్ సన్నివేశాలు ఈ వీడియోలో కనిపించాయి. ఈ మేకింగ్ వీడియోలో చూపించిన కొన్ని విజువల్స్ చూసి ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. మూవీలో కనిపించే ఖాన్సార్ కోటలో పెద్ద పెద్ద విగ్రహాలు కత్తులు పట్టుకొని నిలబడి కనిపిస్తాయి. ఇవి గ్రాఫిక్స్ లో చూపించారని అందుకున్నారు. కానీ ఇప్పుడు మేకింగ్ వీడియోలో అవి సెట్ ప్రోపర్టీగా కనిపించాయి. అలాగే హెలికాప్టర్స్, యుద్ధ వాహనాల్ని కూడా గ్రాఫిక్స్ కాకుండా ఒరిజినల్ గానే చూపించారు.

ఇక ఈ వీడియోను చూసిన ఆడియన్స్.. ప్రశాంత్ నీల్ మూవీ కోసం చాలా కష్టపడినట్లు తెలుస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి మేకింగ్ షాట్ లో టెక్నీషియన్స్, యాక్టర్స్ తో కలుపుకుని దాదాపు 100కు పైగా మెంబెర్స్ సెట్ లో కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.