సలార్.. ప్రభాస్ కటౌట్ అంతకుమించి
సినిమా రిలీజ్ కి మరో ఐదు రోజులు ఉండగానే ఇండియా వ్యాప్తంగా సలార్ ఫీవర్ స్టార్ట్ అయింది.
By: Tupaki Desk | 17 Dec 2023 6:50 PM GMTఓవర్సీస్ లోనే కాదు ఇండియాలోనూ 'సలార్' మ్యానియా మొదలైపోయింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం అభిమానులతో పాటు ఆడియన్స్ సైతం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. సినిమా రిలీజ్ కి మరో ఐదు రోజులు ఉండగానే ఇండియా వ్యాప్తంగా సలార్ ఫీవర్ స్టార్ట్ అయింది.
ఇప్పటికే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ సలార్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్మడవుతున్నాయి. ఈరోజు ఈవినింగ్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. సలార్ తెలుగు అడ్వాన్స్ బుకింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగరుగా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ సినిమా థియేటర్స్ లో వస్తుందంటే కాస్త ముందుగానే హడావిడి మొదలవుతుంది. ఇప్పుడు 'సలార్' విషయంలోనూ అదే జరిగింది.
తాజాగా 'సలార్' సినిమాకు సంబంధించి ప్రభాస్ 120 అడుగుల భారీ కటౌట్ ను ముంబైలో పెట్టారు. ముంబై థానే లోని R మాల్ ముందు ఉంచిన ఈ 120 అడుగుల భారీ కటౌట్ అక్కడి ఆడియన్స్ దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తుంది. ఈ కటౌట్ కి సంబంధించిన ఫోటో నెట్టింట తెగ చెక్కర్లు కొడుతోంది. ఈ భారీ కటౌట్ ని క్రేన్ సహాయంతో ఉంచారు. దీన్ని బట్టి నార్త్ లో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో స్పష్టమవుతుంది.
ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ కు ఇలాంటి భారీ కటౌట్స్ పెట్టేవాళ్ళు అభిమానులు. కానీ ఇప్పుడు నార్త్ లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇలాంటి భారీ కటౌట్స్ పెట్టడం విశేషం అనే చెప్పాలి. కాగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కి 'సాహో' సినిమాతో నార్త్ లో వారి క్రేజ్ ఏర్పడింది. 'సాహో' మూవీ సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువగా ఆడింది. ప్లాప్ టాక్ తోనే ఈ మూవీ బాలీవుడ్ లో రూ.100 కోట్లు వసూలు చేసింది.
ఇక ప్రభాస్ తాజాగా నటించిన 'సలార్' కి కూడా నార్త్ లో భారీ హైప్ నెలకొంది. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే బాలీవుడ్ రికార్డ్స్ అన్ని బ్రేక్ అవ్వడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. నిజానికి సలార్ కి పోటీగా బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ 'డంకీ' మూవీ రిలీజ్ అవుతుంది. అయినా కూడా ముంబైలో సలార్ 120 అడుగుల భారీ కటౌట్ ని ఏర్పాటు చేయడం విశేషం. దీన్నిబట్టి నార్త్ లోనూ షారుక్ ఖాన్ పై ప్రభాస్ డామినేషన్ నడుస్తుందని చెప్పొచ్చు