Begin typing your search above and press return to search.

సలార్‌.. చివరి క్షణంలో హాట్ బ్యూటీ ఎంట్రీ

ప్రభాస్ అభిమానులతో పాటు పాన్‌ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం సలార్‌.

By:  Tupaki Desk   |   9 Nov 2023 10:52 AM GMT
సలార్‌.. చివరి క్షణంలో హాట్ బ్యూటీ ఎంట్రీ
X

ప్రభాస్ అభిమానులతో పాటు పాన్‌ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం సలార్‌. బాహుబలి తో పాన్ ఇండియా రేంజ్ లో సూపర్‌ స్టార్‌ అయిన ప్రభాస్‌, కేజీఎఫ్ తో స్టార్‌ దర్శకుడిగా మారిన ప్రశాంత్‌ నీల్‌ కాంబో లో మూవీ అంటూ ప్రకటించినప్పటి నుంచి కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరుగి పోయాయి.

ఇప్పటికే ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా ఏవో కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఎట్టకేలకు క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేసి తీరుతాం అంటూ మేకర్స్ ప్రకటించారు. విడుదలకు నెల రోజుల సమయం ఉండగా కూడా ఒక పాట చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

చివరి నిమిషంలో చిత్రీకరణ జరుపుతున్న ఈ ప్రత్యేక పాటలో హాట్‌ బ్యూటీ సిమ్రత్‌ కౌర్‌ కనిపించబోతుంది. బంగార్రాజు, డర్టీ హరి తో పాటు బాలీవుడ్‌ లో పలు సినిమాల్లో కనిపించి మెప్పించి తన అందాలతో ఉర్రూతలూగించిన సిమ్రత్‌ కౌర్‌ సలార్‌ లోని ప్రత్యేక పాటలో కనిపించబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు తెలియజేశారు.

ఈ పాటలో ప్రభాస్‌ కూడా కనిపించాల్సి ఉంది. ఇప్పటి వరకు సిమ్రత్‌ కౌర్ సింగిల్‌ షాట్స్ ను చిత్రీకరించిన మేకర్స్ త్వరలో ప్రభాస్‌ కూడా సెట్స్ లో జాయిన్‌ అవ్వబోతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సినిమాలో మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్ సుకుమారన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. శృతి హాసన్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాదిలో సలార్‌ 2 వచ్చే అవకాశాలు ఉన్నాయి.