Begin typing your search above and press return to search.

సలార్.. ఆ ఒక్కటీ మిస్ అయ్యిందే!

సలార్.. సలార్.. సలార్ గత కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజైపోయింది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు మార్మోగిపోతున్నాయి.

By:  Tupaki Desk   |   22 Dec 2023 10:24 AM GMT
సలార్.. ఆ ఒక్కటీ మిస్ అయ్యిందే!
X

సలార్.. సలార్.. సలార్ గత కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజైపోయింది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు మార్మోగిపోతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులతోపాటు సినీ ప్రియులు.. సినిమా చూసేందుకు బారులు తీరుతున్నారు. నైట్ ఒంటిగంట షో నుంచే సలార్‌కు హిట్ టాక్ పడిపోయింది. ప్రభాస్ కటౌట్కు తగిన స్టోరీ పడిందని ఫ్యాన్స్ అనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్, ప్రభాస్ వైల్డ్ యాక్షన్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు

ఇదంతా పక్కనపెడితే.. కొద్ది నెలల క్రితం ప్రభాస్తో డైనోసర్తో పోలుస్తూ టీజర్ను రిలీజ్ చేశారు సలార్ మేకర్స్. ఆ టీజర్లో 'వరల్డ్ వైడ్‌గా ఉన్న గ్యాంగ్‌స్టర్స్ అంతా కలిసి వాడెక్కడ' అంటూ అరుస్తూ టిన్నూ ఆనంద్‌ను టార్గెట్ చేస్తారు. "ఏయ్.. సింపుల్ ఇంగ్లీష్, నో కన్ఫ్యూజన్.. Lion Cheetah Tiger Elephant are Very Dangerous, But Not in Jurassic Park because there is a డైనోసర్" అంటూ టిన్నూ ఆనంద్ చెప్పిన డైలాగ్ అప్పట్లో మార్మోగిపోయింది. డార్లింగ్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించింది.

దీంతో ఈ టీజర్ రిలీజైన నాటి నుంచి సలార్ ప్రస్థావన వచ్చినప్పుడల్లా అంతా డైనోసర్ అంటూ ఎలివేషన్ ఇస్తూనే ఉన్నారు. దర్శకుడు రాజమౌళి కూడా కేవలం డైనోసర్ సీక్వెన్స్ కోసమే సినిమాకు వెళ్తున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ టిన్నూ ఆనంద్ చెప్పిన డైలాగ్ సలార్ ఫస్ట్ పార్ట్లో ఎక్కడా లేదు. ట్రైలర్లో ఉన్న ప్రతి డైలాగ్, షాట్స్ అన్నీ సీజ్ ఫైర్లో ఉన్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. డైనోసర్గా ప్రభాస్కు ఇచ్చిన ఎలివేషన్ డైలాగ్ మాత్రం మిస్ అయిందని చెబుతున్నారు.

అయితే టిన్నూ ఆనంద్ చెప్పిన డైలాగ్ సలార్ సెకండ్ పార్ట్లోనిదేమోనని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక నిజమైతే.. సలార్ పార్ట్-2 శౌర్యాంగ పర్వంలో జరగబోయే ఊచకోత మామూలుగా ఉండదు. ఫస్ట్ పార్ట్‌లోనే ప్రభాస్కు ప్రశాంత్ నీల్కు ఇచ్చిన ఎలివేషన్ బీభత్సంగా ఉంది. అలాంటిది సెకండ్ పార్ట్‌లో డైనోసర్ ఎటాక్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే నిజంగా ఆ డైలాగ్ సీక్వెన్స్లో ఉంటుందా? లేదా టీజర్ కోసమే దానిని స్పెషల్గా షూట్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది.