Begin typing your search above and press return to search.

సలార్.. ఆ చిన్న డౌట్ కూడా తీరింది!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ సలార్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By:  Tupaki Desk   |   11 Nov 2023 11:39 AM GMT
సలార్.. ఆ చిన్న డౌట్ కూడా తీరింది!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ సలార్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ ఆలస్యం చేస్తుంది అనే అభిప్రాయాలను కూడా గట్టిగానే వస్తున్నాయి. దీంతో సినిమా అసలు ఇప్పుడైనా అనుకున్న సమయానికి విడుదల అవుతుందా లేదా అనే డౌట్స్ కూడా గట్టిగానే వచ్చాయి.


చిత్ర నిర్మాణ సంస్థ హొంబల్ ఫిల్మ్స్ ఏ సినిమాకు ఈ తరహాలో కన్ఫ్యూజన్ అయితే చేయలేదు. ఇక దర్శకుడు సినిమా అవుట్ పుట్ పర్ఫెక్ట్ గా ఉండే విధంగా కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఎప్పుడో సెప్టెంబర్ లో రావాల్సిన సలార్ సినిమా ఇప్పుడు డిసెంబర్ 22 కు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే కనీసం ఇప్పుడైనా ప్లాన్ ప్రకారం సినిమాను విడుదల చేస్తారా లేదా అని కన్ఫ్యూషజన్ కూడా గట్టిగానే వచ్చింది.

ఎందుకంటే గాసిప్స్ ఎన్ని వస్తున్న కూడా మేకర్స్ నుంచి మొదట పెద్దగా క్లారిటీ అయితే రాలేదు. ఇక మొత్తానికి చిత్ర నిర్మాణ సంస్థ ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాకు కన్నడలో చాలా హై డిమాండ్ అయితే ఉంది. అయితే అక్కడ థియేట్రికల్ హక్కులు ఎవరికి ఇవ్వకుండా హోంబెల్ నిర్మాతలే సొంతంగా విడుదల చేసుకుంటున్నారు. ఆ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.

ఇక ఇప్పుడిప్పుడే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన థియేట్రికల్ డీల్స్ అయితే క్లోజ్ అవుతున్నాయి. అయితే కొన్ని డీల్స్ విషయంలో ఆలస్యం జరుగుతూ ఉండడంతో సినిమాలు మరికొన్ని రోజులు వాయిదా వేయబోతున్నారు అన్నట్లుగా కూడా గాసిప్స్ పట్టుకొచ్చాయి. అయితే ఇప్పుడు అందులో ఎలాంటి నిజం లేదని లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్లో రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు.

సినిమా డిసెంబర్ 22 కు రాబోతుంది అని అనౌన్స్ చేశారు. దీంతో ఫ్యాన్స్ అన్ని డౌట్లు క్లియర్ అయ్యాయి అని చెప్పాలి. ఇక హిందీలో మాత్రం ఈ సినిమా డీల్స్ విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు అని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ మళ్ళీ వెనుకడుగు వేసినట్లు కూడా గాసిప్స్ వచ్చాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక సైనిక ట్రైలర్ను డిసెంబర్ 1వ తేదీన విడుదల చేయబోతున్నారు.