Begin typing your search above and press return to search.

ఒక్కటి తక్కువైంది సలార్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. ఈ సినిమా డిసెంబర్ 22న థియేటర్స్ లోకి రాబోతోంది.

By:  Tupaki Desk   |   9 Dec 2023 4:25 AM GMT
ఒక్కటి తక్కువైంది సలార్..
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. ఈ సినిమా డిసెంబర్ 22న థియేటర్స్ లోకి రాబోతోంది. పాన్ ఇండియా లెవల్ లో ఐదు భాషలలో సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మూవీపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం జరిగింది. కచ్చితంగా ప్రభాస్ ఖాతాలో సలార్ బ్లాక్ బస్టర్ గా చేరుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ లో సలార్ కథ ఏంటి అనేది ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక సిల్వర్ స్క్రీన్ పై దేవా పాత్రలో ప్రభాస్ సృష్టించే విద్వంసం ఎలా ఉండబోతోంది అనేది చూడటం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ మూవీ నుంచి సలార్ సీజ్ ఫైర్ మూవీ రాబోతోంది.

పార్ట్ 2 వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ట్రైలర్ లో ప్రభాస్ యాక్షన్ ఎలివేషన్ పెద్దగా లేదనే టాక్ వినిపించింది. అలాగే ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రంకి రీమేక్ వెర్షన్ అనే టాక్ కూడా నడుస్తోంది. అయితే ప్రశాంత్ నీల్ మేకింగ్ విజన్ మీద డార్లింగ్ అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పాత్ర నిడివి తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే హీరోయిన్ ఉన్న తర్వాత సాంగ్స్ లేకుంటే బాగోదనే మాట వినిపిస్తోంది. కమర్షియల్ సినిమా అన్న తర్వాత సాంగ్స్ ఉంటే సినిమాకి మరింత బలం వస్తుందని అభిమానులు అంటున్నారు. అయితే సలార్ పై సాంగ్స్ గురించి ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ టీమ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.

కేజీఎఫ్ సిరీస్ లో ఉన్నవి తక్కువ సాంగ్స్ అయిన సినిమా కంటెంట్ ని ఎలివేట్ చేసే విధంగా ఉన్నాయి. ఆ సాంగ్స్ కూడా మూవీ సక్సెస్ లో భాగం అయ్యాయి. అలాంటి పాటలు సలార్ కూడా ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇంత పెద్ద సినిమాలో కనీసం ఒక్క సాంగ్ కూడా ఎలివేషన్ ఇచ్చే రేంజ్ లో కంపోజ్ చేయలేదా అనే సందేహాలు వస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ రవి బసృర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై కూడా ఈసారి అనుమానాలు వస్తున్నాయి. మరి వెండితెరపై సినిమా చూసినప్పుడు మెప్పిస్తాడో లేదో చూడాలి.