Begin typing your search above and press return to search.

సలార్.. మళ్ళీ షాక్ ఇచ్చారేంటి?

డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి రాబోతోంది

By:  Tupaki Desk   |   17 Dec 2023 10:08 AM GMT
సలార్.. మళ్ళీ షాక్ ఇచ్చారేంటి?
X

డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రెడీ అయిన ఈ సినిమా ప్రమోషన్స్ పై ప్రశాంత్ నీల్ ఫోకస్ చేశారు. ఇప్పటికే చిత్ర యూనిట్ ని రాజమౌళి ఇంటర్వ్యూ చేసిన వీడియో షూట్ చేశారు. సాంగ్ కూడా రిలీజ్ చేసి బజ్ క్రియేట్ చేశారు.

మరో ఇంటర్వ్యూ షూట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సోమవారం సలార్ నుంచి యాక్షన్ ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ యాక్షన్ ట్రైలర్ తో మూవీకి భారీ హైప్ క్రియేట్ అవుతుంది. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సలార్ ద్వారా భారీ ఓపెనింగ్స్ రికార్డ్ క్రియేట్ చేయాలని ప్రశాంత్ నీల్ టార్గెట్ గా పెట్టుకన్నారు.

మరో వైపు ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలు రిలీజ్ చేసే సమయంలో మీడియా మీట్ ఏర్పాటు చేస్తున్నారు. అన్ని మీడియా సంస్థలతో స్టేజ్ నుంచి మాట్లాడుతూ సినిమా విశేషాలని పంచుకుంటున్నారు. ఈ మీడియా మీట్ అనేది బాగా పాపులర్ అయ్యింది. జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకి చిత్ర యూనిట్ సమాధానాలు చెబుతూ ఉన్న్తారు.

నిజానికి ఈ మీడియా మీట్ నిసోమవారం ట్రైలర్ రిలీజ్ సమయంలోనే పెడతారనే ప్రచారం జరిగింది. ఈ మీడియా మీట్ తో సినిమాకి అదనపు బూస్టింగ్ వస్తుందని, అందుకోసమే ప్రశాంత్ నీల్ సినిమాకి సంబందించిన అన్ని విషయాలు చెప్పడానికి సిద్ధం అవుతున్నారని టాక్ వినిపించింది. అయితే సోమవారం ఎలాంటి మీడియా మీట్ లేదనే క్లారిటీ తాజాగా తెరపైకి వచ్చింది.

ట్రైలర్ రిలీజ్ ఉంది కాబట్టి అందరి దృష్టి తానిపైనే ఉండాలని, ఈ ప్రమోషనల్ మీట్ ని తరువాతకి వాయిదా వేసి ఉంటారనే మాట వినిపిస్తోంది. మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్ గా రియాక్ట్ అవ్వాల్సిందే. ఇక ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్ ని రాజమౌళి ఇంటర్వ్యూ చేసిన వీడియో అయితే సోమవారం సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.