Begin typing your search above and press return to search.

సలార్ ఎఫెక్ట్‌.. ఆ క్రేజీ మూవీ డేట్‌ ఛేంజ్‌?

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్‌ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది

By:  Tupaki Desk   |   4 Oct 2023 12:30 AM GMT
సలార్ ఎఫెక్ట్‌.. ఆ క్రేజీ మూవీ డేట్‌ ఛేంజ్‌?
X

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్‌ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం గత నెలలోనే సలార్‌ 1 విడుదల అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల డిసెంబర్ లో క్రిస్మస్ సందర్భంగా సలార్‌ ని విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

ఉన్నట్లుండి క్రిస్మస్ కి సలార్ అంటూ డేట్‌ ప్రకటించడంతో తెలుగు సినిమాలతో పాటు అన్ని భాషల సినిమాలు కూడా తమ డేట్ ల విషయం లో సరి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా వరకు క్రిస్మస్ కి రావాలి అనుకున్న వారు కాస్త ముందు లేదా వెనక్కి వెళ్లి పోతున్నారు. డుంకీ మాత్రం అదే క్రిస్మస్‌ కి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక తమిళ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రీనా కైఫ్ జంటగా నటించిన 'మెరీ క్రిస్మస్‌' సినిమాను మొదట క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌ 15న విడుదల చేయాలని భావించారు. కానీ సలార్‌ మరియు షారుఖ్‌ డుంకీ సినిమా లు ఉన్న కారణంగా ఒక వారం ముందుగానే అంటే డిసెంబర్‌ 8న విడుదలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఎంతో మంది బాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో, సూపర్ స్టార్స్ తో నటించిన కత్రీనా కైఫ్ సౌత్‌ నటుడు విజయ్ సేతుపతి తో కలిసి నటించడం తో అందరి దృష్టి సినిమాపై పడింది. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అంధాధున్‌ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న కారణంగా కూడా హిందీ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

పాజిటివ్‌ బజ్ ఉన్న 'మెరీ క్రిస్మస్‌' సినిమాను పోటీ ఉన్న సమయంలో విడుదల చేసి నష్టపోవడం కంటే పోటీ లేని సమయంలో విడుదల చేయడం మంచిది అనే ఉద్దేశ్యంతో మేకర్స్ వారం రోజుల ముందుగానే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వారం ముందు విడుదల నిర్ణయాన్ని మంచి నిర్ణయం అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.