Begin typing your search above and press return to search.

సలార్ అసలు కథ ఇదేనా?

పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రభాస్ ఈ సినిమాలో ఫ్రెండ్స్ గా ఉంటారంట. ఫస్ట్ పార్ట్ లోనే ఎమోషనల్ డ్రామా ఎక్కువగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   29 Nov 2023 4:06 AM GMT
సలార్ అసలు కథ ఇదేనా?
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా సలార్. ఈ మూవీ డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి వస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో సలార్ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా చెప్పబోతున్నారు. అందులో పార్ట్ 1 డిసెంబర్ లో రిలీజ్ అవుతోంది.

కేజీఎఫ్ సిరీస్ లో తల్లి, కొడుకుల సెంటిమెంట్ మూవీకి హైలైట్ గా నిలిచింది. ఆ ఎపిసోడ్ మొత్తం నెక్స్ట్ లెవల్ లో సినిమాకి బూస్టింగ్ గా ఉపయోగపడింది. ఇప్పుడు సలార్ సినిమాలో కూడా అలాంటి ఎమోషనల్ కాన్సెప్ట్ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇ ఈ మూవీ ట్రైలర్ డిసెంబర్ మొదటి వారంలో రానుంది. దీనికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు.

సినిమాపైన బిజినెస్ అయితే పూర్తయ్యింది. డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడైపోయాయి. ప్రభాస్ నుంచి సాలిడ్ హిట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న ఇద్దరు తరువాత బద్ధ శత్రువులుగా ఎందుకు అయ్యారు. ఒకరి మీద ఒకరు ప్రతీకారం తీర్చుకునే స్థాయిలో శత్రుత్వం ఎలా పెరిగింది అనేది సలార్ కథలో భాగంగా ఉంటుందంట.

పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రభాస్ ఈ సినిమాలో ఫ్రెండ్స్ గా ఉంటారంట. ఫస్ట్ పార్ట్ లోనే ఎమోషనల్ డ్రామా ఎక్కువగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా నిడివి సుమారు 6 గంటల వరకు ఉంటుందని, అందుకే రెండు భాగాలుగా చేస్తున్నట్లు ప్రశాంత్ నీల్ గతంలో క్లారిటీ ఇచ్చారు. అయితే బిజినెస్ స్ట్రాటజీలో భాగంగానే ఇలా రెండు పార్ట్శ్ చేశారనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఏది ఏమైనా సలార్ మూవీ కోసం అయితే అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ ని యాక్షన్ హీరోగా తెరపై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆదిపురుష్ డిజాస్టర్ తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పడానికి సలార్ మూవీకి వస్తోన్న ఆదరణ చూపించొచ్చు.