'సలార్' 15 ఏళ్ల క్రితం నాటి స్టోరీ!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సలార్' భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 20 Dec 2023 11:30 PM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సలార్' భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అంతకంతకు హైప్ పెంచేసాయి. ఇంకా రెండు రోజులే సమయం ఉండటంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు నమోదు చేస్తోంది.
అభిమానుల దాడికి ఏకంగా సర్వర్ సైతం క్లాష్ అయింది. ఆ రేంజ్ లో సలార్ మేనియా మార్కెట్ లో కనిపి స్తోంది. 'కేజీఎఫ్' ని మించి చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ సైతం అంచనా వేస్తుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ నేపథ్యంలో తాజాగా సలార్ గురించి ప్రశాంత్ నీల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 'సలార్ జర్నీ ఇప్పుడు మొదలైంది కాదు.
కొన్నేళ్ల క్రితమే మొదలైంది. ఈ కథ సినిమాగా చేయాలని 15 ఏళ్ల క్రితమే ఆలోచన వచ్చింది. కానీ బడ్జెట్..సమయం ఇవన్నీ కావాలి. అప్పట్లో ఇవి సాధ్యమయ్యేది కాదని తెలిసి వదిలేసాను. ఆ తర్వాత 'ఉగ్రం'తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాను. కేజీఎఫ్ కోసం దాదాపు ఎనిమిదేళ్లు పనిచేసా. కోవిడ్ సమయంలో ప్రభాస్ కు సలార్ కథ చెప్పాను. ఆయన ఒకే అన్నారు. ఈ కథ ద్వారా తెరపై దేవ అనే పాత్ర చూపించాలనుకున్నా.
అందుకోసం చాలా శ్రమించాను. ప్రభాస్ లో అమాయకత్వం నాకెంతో నచ్చుతుంది. దేవ పాత్రకి ఆయన సరిగ్గా నప్పుతాడనిపించింది. ఈ కథ అనుకున్నప్పుడు రెండు భాగాలుగా చేయాలనే ఉద్దేశం నాకు లేదు. కాకపోతే పాత్రలను చిత్రీకరిస్తున్నప్పుడు రెండున్నరగంటల్లో దీన్ని చెప్పడం కష్టం అనిపించింది. అందుకే రెండు భాగాలుగా తీర్చిదిద్దాలని డిసైడ్ అయి ముందుకెళ్లాను. నేను అనుకున్నట్లు తీయగలి గాను. మరి ఫలితం ఎలా ఉంటుందన్నది ప్రేక్షకులు నిర్ణయించాలి' అని అన్నారు.