సలార్.. అంతా మీ ఇష్టమేనా?
కానీ సలార్ మాత్రం ఎదుటివారి పరిస్థితిని అసలు ఏ మాత్రం అర్థం చేసుకోకుండా మాకు నచ్చిన డేట్ కు వస్తాము అనేలా రిలీజ్ విషయంలో ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది.
By: Tupaki Desk | 29 Sep 2023 12:18 PM GMTప్రభాస్ బ్యాడ్ లక్ అనుకోవాల లేక అనుకోకుండా జరిగిందని సర్దుకుపోవాలా..? ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ లో క్రియేట్ అవుతున్న కన్ఫ్యూజన్. బాహుబలి తర్వాత వరుస సినిమాలతో నిరాశపరచడమే కాకుండా ట్రోల్స్ బారిన పడుతున్న ప్రభాస్ సినిమాలు చాలా బాధించాయి. ఇక వాటన్నిటికీ దీటుగా సలార్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ సమాధానం చెబుతాడు అని ఆశతో ఉన్నారు.
కానీ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం హోంబెల్ వారు చాలా దాగుడుమూతలు ఆడారు. విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ లో కూడా ప్రభాస్ మొహం కనిపించకపోవడంతో చాలా అనుమానాలు మొదలైపోయాయి. ఇక మొత్తానికి డిసెంబర్ 22 ఫిక్స్ చేసుకున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. రిలీజ్ డేట్ అయితే చెప్పేసారు కానీ సలార్ టీం ప్రవర్తిస్తున్న విధానం మాత్రం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా రిలీజ్ డేట్స్ విషయంలో క్లాష్ ఉండకూడదు అని కొన్ని సినిమాలు ఏడాదికి ముందే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే తమ సినిమాల వల్ల ఒకరి ఇబ్బంది రాకూడదు అలాగే ఎవరూ రానీ సమయంలోనే వస్తే బాగుంటుంది అని ఆలోచనతో కొంతమంది దర్శక నిర్మాతలు ఆలోచిస్తూ ఉంటారు.
కానీ సలార్ మాత్రం ఎదుటివారి పరిస్థితిని అసలు ఏ మాత్రం అర్థం చేసుకోకుండా మాకు నచ్చిన డేట్ కు వస్తాము అనేలా రిలీజ్ విషయంలో ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్లో డుంకి సినిమాకు పోటీగా రావడం కూడా కొంత మార్కెట్ పై ప్రభావం చూపకపోదు.
పటాన్ జవాన్ సినిమాలతో ఇటీవల సౌత్ లో షారుక్ ఖాన్ కు మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. ఇక ప్రభాస్ కూడా తన గత సినిమాలతో నార్త్ లో మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాల క్లాష్ అయితే ఇద్దరికీ కూడా అవతలి భాషలో అయితే కలెక్షన్స్ లపై ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. అయితే డుంకి ఒకవేళ తట్టుకున్న కూడా ఏ భాషలో అయినా సరే మీడియం రేంజ్ సినిమాలు ఈ క్లాష్ తట్టుకోలేవు.
ఇక తెలుగులో అయితే నాని హాయ్ నాన్న వెంకటేష్ సైంధవ్ సినిమాతో పాటు నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలు వాయిదా పడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. రిలీజ్ విషయంలో అప్డేట్స్ విషయంలో ఫ్యాన్స్ కు చాలా చిరాకు తెప్పించిన సలార్ టీమ్ కనీసం ఒక చిన్న సారీ కూడా చెప్పకుండానే డిసెంబర్ 21కి వచ్చేస్తున్నామంటూ గట్టిగా పోస్టర్ వదిలింది. అలాగే మరోవైపు డిసెంబర్లో విడుదల కావాల్సిన సినిమా నిర్మాతలకు కనీసం ఒక మాట అయినా చెప్పి ధియేటర్ల విషయంలో సర్దుబాటు చేసుకుని ఉంటే బాగుండేది. ఇక ఇవేవీ పట్టించుకోకుండా సోలార్ టీమ్ దూసుకుపోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది వారి ఆలోచించుకోవాలి.