Begin typing your search above and press return to search.

వీడియో : సలార్‌ కొత్త పాట వినరా...!

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్‌ సినిమా హిట్ టాక్ ను దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   26 Dec 2023 6:43 AM GMT
వీడియో : సలార్‌ కొత్త పాట వినరా...!
X

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్‌ సినిమా హిట్ టాక్ ను దక్కించుకుంది. ఒకటి రెండు చోట్ల మినహా మెజార్టీ చోట్ల సినిమా కు సాలిడ్ కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి. సినిమాకు లాంగ్ వీకెండ్‌ బాగా కలిసి వచ్చింది. దాదాపు మూడు రోజుల పాటు ఈ సినిమాకు సెలవులు కలిసి వచ్చాయి.

సలార్‌ సినిమా వెయ్యి కోట్ల వసూళ్ల దిశగా దూసుకు వెళ్తోంది. సినిమా స్థాయిని మరింత పెంచేందుకు, సినిమా గురించి జనాలు మరింత తల్చుకునేందుకు గాను మేకర్స్ ప్రమోషన్ లో భాగంగా వినరా... అనే పాటను విడుదల చేయడం జరిగింది.

తెలుగు తో పాటు అన్ని భాషల్లో కూడా వినరా పాటను విడుదల చేయడం ద్వారా సినిమాపై సాధారణ జనాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచే ప్రయత్నం చేశారు. పాటలో లిరిక్స్ తో పాటు విజువల్స్ ఆకట్టుకునే విధంగా సలార్‌ మేకర్స్ ప్లాన్‌ చేశారు.

సినిమాలోని ముఖ్య పాత్రలను డిఫరెంట్‌ క్లే మోడల్స్ గా రూపొందించి, వాటితో కథ ను చెప్పే ప్రయత్నం చేశారు. సినిమాలోని కథ ను ఈ పాటలో రివీల్ చేసేందుకు ప్రయత్నించారు. మొత్తానికి పాట మరియు విజువల్స్ బాగున్నాయి అన్నట్లుగా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.