Begin typing your search above and press return to search.

ట్రైలర్ 1 దేవా.. ట్రైలర్ 2 సలార్

కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ తర్వాత కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమా తెరకెక్కిస్తుండడంతో మరిన్ని అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.

By:  Tupaki Desk   |   7 Dec 2023 6:23 AM GMT
ట్రైలర్ 1 దేవా.. ట్రైలర్ 2 సలార్
X

ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సలార్. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు అంతగా మెప్పించకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఈ మూవీపైనే పెట్టుకున్నారు. ప్రభాస్ కూడా కొన్నేళ్ల తర్వాత ఫుల్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు.

కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ తర్వాత కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమా తెరకెక్కిస్తుండడంతో మరిన్ని అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే విడుదలైన సలార్ పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచగా ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్‏తో ఈ సినిమా ఏ రేంజ్‏లో ఉంటుందో చెప్పేశారు ప్రశాంత్ నీల్. ప్రభాస్ అభిమానులు ఊహించని రీతిలో మాస్ యాక్షన్ కంటెంట్ ఈ సినిమాలో ఉండనుందని తెలుస్తోంది. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఈ మూవీ విడుదల పెద్ద పండగే.

ఇక, ఇప్పుడు సలార్ సెకండ్ ట్రైలర్ గురించి మరో క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. మొదటి ట్రైలర్ లో దేవా వెర్షన్ లో ప్రభాస్ సందడి చేయగా.. ఇప్పుడు సలార్ గా డార్లింగ్ కనిపించనున్నారట. దేవా నుండి సలార్ గా ప్రభాస్ ఎలా మారాడు అన్న విషయం సెకండ్ ట్రైలర్ లో ఉండనుందని బజ్ వినిపిస్తోంది. లేదంటే సలార్ అనే మరో క్యారెక్టర్ తో సర్ ప్రైజ్ ఇస్తారా అనే సందేహం కూడా వస్తోంది. దీంతో ఈ సెకండ్ ట్రైలర్ పై అంచనాలు తెగ పెరిగిపోతున్నాయి.

సినిమా విడుదలకు ఐదు రోజుల ముందు డిసెంబర్ 16వ తేదీన ఈ రెండో ట్రైలర్ రిలీజ్ కానుందని సమాచారం. కేజీఎఫ్ 1, 2 బ్లాక్ బస్టర్ల తర్వాత భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ మూవీలో ప్రభాస సరసన శ్రుతి హాసన్ కనిపించనుంది.

మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకురాబోతున్నట్లు గతంలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెలిపారు. తొలి భాగం డిసెంబర్ 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.