'సలార్' ఏ OTTలో వస్తుందో తెలుసా?
ఇప్పటికే విదేశాల్లో ప్రభాస్ కెరీర్ బెస్ట్ ఓపెనింగుల రికార్డులు నమోదయ్యాయని కథనాలొచ్చాయి.
By: Tupaki Desk | 22 Dec 2023 7:16 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ ఈ శుక్రవారం (22డిసెంబర్) అత్యంత భారీ హైప్ నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. పీవీఆర్ ఐనాక్స్ తో సమస్యల్ని పరిష్కరించుకుని ఇప్పుడు ఉత్తరాది, దక్షిణాదిన అదనపు థియేటర్లతో భారీగా విడుదలైన ఈ సినిమాకి సంబంధించిన సమీక్షలు మరి కాసేపట్లో వెబ్ లో రానున్నాయి.
మాస్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ `సలార్` మానియా అసాధారణంగా ఉండడంతో భారీ ఓపెనింగులు సాధ్యమవుతాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇప్పటికే విదేశాల్లో ప్రభాస్ కెరీర్ బెస్ట్ ఓపెనింగుల రికార్డులు నమోదయ్యాయని కథనాలొచ్చాయి. అలాగే నైజాంలోను సలార్ ఓ ఊపు ఊపుతోంది. ఇదిలా ఉంటే, సలార్ ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి.
సలార్ ఓటీటీ రైట్స్ ని పాపులర్ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఛేజిక్కించుకుంది. ఈ డీల్ కోసం దాదాపు 200 కోట్లు వెచ్చించిందని ప్రచారం సాగుతోంది. ఈ క్రిస్మస్ సెలవులను పురస్కరించుకుని సలార్ భారీ వసూళ్లను సాధిస్తుంది. సెలవుల్లో భారీగా జనాల్ని థియేటర్లకు పుల్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే 2024 సంక్రాంతి వరకూ సలార్ హవా కొనసాగుతుంది. సంక్రాంతి సెలవుల్ని ప్రభాస్ ఎన్ క్యాష్ చేస్కుంటాడని అంచనా వేస్తున్నారు. మరోవైపు డంకీ, హాలీవుడ్ చిత్రం ఆక్వామేన్ 2 చిత్రాలకు సమీక్షలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఇది సలార్ కి కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు.
సలార్ చిత్రాన్ని యాక్షన్ ప్యాక్డ్ కంటెంట్ తో థ్రిల్లింగ్ గా రూపొందించడంలో ప్రశాంత్ నీల్ సఫలమయ్యాడని కూడా ఇప్పటికే కొన్ని తెలుగు మీడియాలు కథనాలు వేసాయి. మరి కాసేపల్లో రివ్యూలు రానున్నాయి. ప్రభాస్ సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. తొలి రోజు, తొలి వీకెండ్, తొలి వారం రికార్డులను సలార్ సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఇక సలార్ ఓటీటీలో రావాలంటే కనీసం 90రోజులు ఆగాల్సి ఉండొచ్చని అంచనా.
2023 బ్లాక్ బస్టర్లు పఠాన్- జవాన్ రికార్డులు బ్రేక్ చేయాలంటే, యానిమల్ రేంజును అందుకోవాలంటే సలార్ లో ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ వర్కవుట్ కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా కథ ప్రజలకు కనెక్టవ్వాలి. ప్రశాంత్ నీల్ బృందం ఈ విషయంలో చాలా ధీమాను కనబరిచిన సంగతి తెలిసిందే.