Begin typing your search above and press return to search.

సలార్ కి ప్రభాస్ కటౌట్ సరిపోతుందా?

మీడియాతో కూడా పెద్దగా ఎంటరాక్స్ కాలేదు. అయిన ప్రొడక్ట్ విషయంలో ప్రశాంత్ నీల్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

By:  Tupaki Desk   |   19 Dec 2023 11:49 AM GMT
సలార్ కి ప్రభాస్ కటౌట్ సరిపోతుందా?
X

డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. రెండు భాగాలుగా సిద్ధమవుతోన్న సలార్ నుంచి పార్ట్ 1 ప్రస్తుతం వస్తోంది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ హైప్ నెలకొని ఉంది.

సలార్ నుంచి వచ్చిన రెండు ట్రైలర్స్ సినిమాపై ఇప్పటికే ఇక ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. తాజాగా వచ్చిన యాక్షన్ ట్రైలర్ అయితే స్ట్రాంగ్ కంటెంట్ తో పాటు అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్ కూడా చిత్రంలో ఉన్నాయని ప్రూవ్ చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ పెద్దగా ప్రమోషన్ ప్లాన్ చేయలేదు. కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాని అయితే దేశ వ్యాప్తంగా తిరిగి ప్రమోట్ చేశారు.

సోషల్ మీడియాలో కూడా సినిమాకి విస్తృత ప్రచారం కల్పించారు. అలాగే సాంగ్స్, డైలాగ్స్ ట్రెండ్ అయ్యేలా చేశారు. ఇన్ని ప్రమోషన్స్ స్ట్రాటజీలు ఉపయోగించడం వలన కేజీఎఫ్ సిరీస్ జనాల్లోకి బలంగా వెళ్ళింది. అయితే సలార్ సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ ఇలాంటివేమీ ప్లాన్ చేయలేదు. రెండు ట్రైలర్స్, ఒక సాంగ్ విడిచిపెట్టాడు. ఇంటర్వ్యూలు కూడా హైదరాబాద్ లో ఫినిష్ చేశారు.

మీడియాతో కూడా పెద్దగా ఎంటరాక్స్ కాలేదు. అయిన ప్రొడక్ట్ విషయంలో ప్రశాంత్ నీల్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సినిమాలో బలమైన ఎమోషన్స్ ని చూపిస్తే ఆటోమేటిక్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోతుందని ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూలలో చెబుతున్నారు. దీనికి కారణం ప్రభాస్ అని చెప్పాలి. ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ సినిమాకి భారీ ఓపెనింగ్స్ తీసుకొస్తుందని భావిస్తున్నారు.

ప్రభాస్ బ్రాండ్ ఇమేజ్ దేశ వ్యాప్తంగా ఉంది. అతని పేస్ కనిపిస్తే మూవీకి మార్కెట్ అయిపోతుంది. ఇప్పుడు సలార్ కి కూడా అదే జరిగింది. ప్రశాంత్ నీల్ నమ్మినట్లుగానే సలార్ సినిమాకి ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఓవర్సీస్ లో అయితే విపరీతంగా టికెట్లు సేల్ అవుతూ ఉండటం విశేషం.