Begin typing your search above and press return to search.

'సలార్'.. ప్రశాంత్ నీల్ చేసిన బిగ్ మిస్టేక్ అదే?

ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోను ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబడుతోంది.

By:  Tupaki Desk   |   26 Dec 2023 12:30 AM GMT
సలార్.. ప్రశాంత్ నీల్ చేసిన బిగ్ మిస్టేక్ అదే?
X

ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన 'సలార్' డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత థియేటర్స్ లో విడుదలై ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోను ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబడుతోంది. నార్త్ లో సలార్ మొదటి రెండు రోజుల్లోనే రూ.31 కోట్ల నెట్ రాబట్టింది. షారుక్ ఖాన్ 'డంకీ' తో క్లాష్ కారణంగా బిగ్ సెంటర్స్ అయిన మల్టీప్లెక్స్ లో సలార్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

నిజానికి మొదటి వీకెండ్ పూర్తయ్యలోపు రూ.50 కోట్ల నెట్ వసూళ్లు సాధించాలని సలార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆదివారం వీకెండ్ కావడంతో కలెక్షన్స్ లో మరింత గ్రోత్ కనిపిస్తుందని భావించినప్పటికీ మాస్ ఆడియన్స్ కోసం సలార్ కి లిమిటెడ్ సింగిల్ స్క్రీన్స్, డంకీతో క్లాష్ కారణంగా కలెక్షన్స్ లో పెద్దగా గ్రోత్ ఉండకపోవచ్చు. సోమవారం క్రిస్మస్ హాలిడే కావడంతో కచ్చితంగా కలెక్షన్ పెరుగుతాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

నిజానికి సలార్ సినిమాని క్రిస్మస్ కి వాయిదా వేయడం, దానికి తోడు షారుక్ ఖాన్ 'డంకీ' సినిమాతో పోటీకి దించేందుకు నిర్ణయం తీసుకోవడం ప్రశాంత్ నీల్ చేసిన బిగ్ మిస్టేక్ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. వీఎఫ్ఎక్స్ పనుల ఆలస్యం, రీ షూట్ వల్ల సలార్ సినిమాని వాయిదా వేశారు. సెప్టెంబర్ 28 నుండి డిసెంబర్ 22 కు సలార్ వాయిదా వేయడం వల్ల బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సలార్ అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ అందుకోలేకపోయింది.

ఒకవేళ సలార్ సెప్టెంబర్ 28న కనుక విడుదలై ఉంటే హిందీలో మొదటి రోజే అత్యంత సులువుగా రూ.31 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకొని ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసేది. కానీ డంకితో క్లాష్ ఏర్పడటం, మల్టీప్లెక్స్ బిజినెస్ కి సంబంధించి గొడవలు జరగడం వల్ల తమిళనాడు, కర్ణాటక వంటి నగరాల్లో మాత్రమే కాకుండా హైదరాబాద్ లోనూ డంకీ మూవీ సలార్ కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

సుమారు రూ.250కోట్ల బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ సినిమా మూడు రోజుల్లో రూ.400 కోట్ల గ్రాస్ ని అందుకుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ సలార్ కి భారీ ప్రేక్షక ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే ఐదు మిలియన్ల మార్క్ ని అందుకోవడం విశేషం.