Begin typing your search above and press return to search.

ప్రతీ గాధలో.. సలార్ సెకండ్ సాంగ్ ఎలా ఉందంటే..

సాంగ్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. పర్ఫెక్ట్ టైమింగ్ లో వస్తే గనక ఏమోషన్ మామూలుగా క్లిక్ అవ్వదు

By:  Tupaki Desk   |   21 Dec 2023 12:25 PM GMT
ప్రతీ గాధలో.. సలార్ సెకండ్ సాంగ్ ఎలా ఉందంటే..
X

ప్రభాస్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్ విడుదలకు ఇంకా ఎంతో సమయం లేదు. KGF సక్సెస్ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని ఫ్యాన్స్ అయితే నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక పాటను ఇప్పటికే విడుదల చేశారు. స్నేహితుల కథలు హైలైట్ చేసే విధంగా సూర్యుడే అనే పాటను డిజైన్ చేసిన విధానం ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది.


ఇక సెకండ్ సాంగ్ ప్రతీ గాధలో అనే పాటను కూడా కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఈ పాటలో మొత్తం పిల్లలను బ్యాగ్రౌండ్ లో పాటించడం జరిగింది. ఈశ్వరి రావ్ పాటను పాడమని చెప్పగా ఒక్కసారిగా పవర్ఫుల్ మ్యూజిక్ తో చిన్నారి గాత్రంతో పాట మొదలవుతుంది. రాక్షసులు రాజ్యంలో ఒక రాజు ఎలా పోరాడాడు అనే అంశాన్ని పాటలో పర్ఫెక్ట్ గా హైలెట్ చేశారు.

సాంగ్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. పర్ఫెక్ట్ టైమింగ్ లో వస్తే గనక ఏమోషన్ మామూలుగా క్లిక్ అవ్వదు. రవి బసృర్ సంగీతం అందించిన ఈ పాటను కె కె రచించారు. చిన్నారులు వారి గాత్రంతో మరింత ప్రాణం పోశారు. ఈశ్వరి రావ్ శృతి హాసన్ కూడా లిరికల్ సాంగ్ లో హైలెట్ గా నిలిచారు. ఇక మొత్తానికి సాంగ్ అయితే సినిమాపై అంచనాలను తగ్గించలేదు.

ఇక సలార్ పార్ట్ 1 కు అంతగా ప్రమోషన్స్ చేయకపోయినప్పటికి బాక్సాఫీస్ వద్ద వేడి మాత్రం మాములుగా క్రియేట్ అవ్వలేదు. తప్పకుండా సినిమా ఫస్ట్ డేనే ఊహించని రేంజ్ లో బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సలార్ సినిమా శుక్రవారం రోజు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. ఇక తెల్లవారుజామున 4 గంటల నుంచి షోలు మొదలు కానున్నాయి.

మరికొన్ని మాస్ సెంటర్లలో స్పెషల్ ప్రీమియర్ షోలతో సలార్ హడావుడి స్టార్ట్ కానుంది. ఏమాత్రం పాజిటీవ్ టాక్ వచ్చినా కూడా సినిమా రికార్డులు ఒక రేంజ్ లో ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ తప్పనిసరిగా సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది. సాహో రాధే శ్యామ్, ఆదిపురుష్ వరుసగా నిరసహపరిచిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమా అయినా డార్లింగ్ కు మంచి రిజల్ట్ ఇస్తుందో లేదో చూడాలి.