సలార్ ఓటీటీ.. ఆ భాషలో లెటేంటి?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న మూవీ సలార్.
By: Tupaki Desk | 20 Jan 2024 11:17 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న మూవీ సలార్. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 730కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీ టాలీవుడ్ లో గత ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో నడుస్తోంది. నార్త్ ఇండియాలో థియేటర్స్ లో డీసెంట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. సంక్రాంతి సందడి పూర్తవడంతో కొన్ని థియేటర్స్ లో సలార్ మూవీని మళ్ళీ రీప్లేస్ చేస్తున్నారు. ఈ టైములో సలార్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ తాజాగా సలార్ మూవీ సౌత్ కి సంబందించిన నాలుగు వెర్షన్స్ ని ఓటీటీలో రిలీజ్ చేసింది.
ఒక్క హిందీ వెర్షన్ మాత్రం ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఇదేంటి కొత్తగా ఈ పద్ధతి అనే ఆలోచన చాలా మందికి రావొచ్చు. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అన్ని కూడా అన్ని భాషలలో ఒకే సారి ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. లియో మూవీ కూడా అలాగే రిలీజ్ అయ్యింది. డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీలో కేవలం నాలుగు వారాల్లో ఓటీటీ రిలీజ్ చేసుకోవడానికి అనుమతిస్తేనే రైట్స్ కొనుగోలు చేస్తున్నాయి.
దీంతో నిర్మాతలు బడ్జెట్ రికవరీ కోసం ఓటీటీలు చెప్పిన రూల్స్ కి అంగీకరిస్తున్నారు. అయితే సౌత్ సినిమాల హిందీ వెర్షన్ ని నార్త్ ఇండియాలో మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేయాలంటే ఎనిమిది వారాల తర్వాతనే ఓటీటీలో రిలీజ్ చేస్తేనే థియేటర్స్ ఇస్తామని కండిషన్స్ పెడుతున్నాయి. లియో మూవీ ఆ రూల్ కి ఒప్పుకోకపోవడంతో సింగిల్ స్క్రీన్స్ లోనే రిలీజ్ అయ్యింది. సలార్ మాత్రం ఒక్క హిందీ వెర్షన్స్ ని డిజిటల్ రిలీజ్ ఆపేసి మిగిలిన నాలుగు వెర్షన్స్ ఓటీటీ రూల్స్ ప్రకారం రిలీజ్ చేశాయి.
ఇక కంప్లీట్ మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మూవీ కావడం సలార్ ఓటీటీలో రిలీజ్ అయిన థియేటర్స్ లో వచ్చే స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ సలార్ చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. మరి లాంగ్ రన్ లో డిజిటల్ లో సలార్ ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తుందనేది చూడాలి.