ప్రభాస్ డైలాగ్ రేంజ్ ఇంత తక్కువా?
ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం `సలార్ సీజ్ ఫైర్` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల వసూళ్లతో సినిమా రికార్డు వసూళ్లని సాధించింది.
By: Tupaki Desk | 21 Jan 2024 12:07 PM GMTప్రభాస్ పాన్ ఇండియా చిత్రం `సలార్ సీజ్ ఫైర్` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల వసూళ్లతో సినిమా రికార్డు వసూళ్లని సాధించింది. ఈ సినిమా 250 కోట్ల పెట్టుబడితో నిర్మాణం కాగా ఫుల్ రన్ లో 700 కోట్ల వసూళ్లని రాబట్టింది. మొదటి భాగంలో దర్శకుడు కేవలం స్టోరీ చెప్పడంపైనే దృష్టి పెట్టారు. ప్రభాస్ ని చూపించాల్సిన రేంజ్ లో తొలి భాగంలో చూపించలేదు.
అసలైన ప్రభాస్ ఆర్మీ ఎలా ఉంటుందన్నది రెండవ భాగంలో ఉంటుంది. అందుకే పార్ట్ -2 ఇంకా అద్భుతంగా ఉంటుందంటూ డార్లింగ్ సంతోషం వ్యక్తం చేసాడు. ప్రస్తుతం ఈసినిమా ఓటీటీలోకి అందు బాటులోకి వచ్చేసింది. ఇంకా కొన్ని చోట్ట థియేటర్లో ఈ సినిమా రన్నింగ్ లో ఉంది. ఇంతలోనే నెట్ ప్లిక్స్ లో వివిధ భాషల్లో రిలీజ్ అయింది. ఆసంగతి పక్కనబెడితే సినిమాలో ప్రభాస్ పాత్రకి కొన్ని డైలాగులే ఉన్నాయని...చాలా పరిమితంగానే ప్రశాంత్ నీల్ డైలాగులు అభిమానులు కాస్త నిరాశ చెందారు.
తాజాగా ఈసినిమా నెట్ ప్లిక్స్ లో అందుబాటులో ఉండటంతో డార్లింగ్ డైలాగ్ టైమింగ్ ని సైతం లెక్కించారు. సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగ్‌ల మొత్తం వ్యవధిని లెక్కించారు. ఒక అభిమాని అన్ని వీడియోలతో ఒక వీడియోను రూపొందించాడు. `సలార్‌లో ప్రభాస్ డైలాగ్ సమయం (స్పీడ్ పెరిగింది). డైలాగ్ గ్యాప్‌లతో దాదాపు 4 నిమిషాలు మరియు గ్యాప్ లు లేకుండా చూస్తే 2:35 నిమిషాలు ఉంది అని రివీల్ చేసాడు.
దీంతో సినిమాలో ప్రభాస్ డైలాగ్ ల టైమ్ ఇప్పుడు నెట్టింట చర్చగా మారింది. కేవలం ప్రభాస్ ఎలివేషన్ తోనే తొలి భాగంలో సరిపెట్టినట్లు తెలుస్తుంది. అయినా వరల్డ్ వైడ్ సినిమా భారీ వసూళ్లు సాధించడంతో ఇవన్నీ లెక్కలోకి రాలేదు. ప్రభాస్ అసలైన యాక్షన్ అంతా రెండవ భాగంలో ఉంటుంది. ఖాన్సార్ సామ్రా జ్యాన్ని స్నేహితుడిగా బహుమతిగా ఇస్తాడా? తానే ఖాన్సార్ కి రాజుగా ప్రకటించుకుంటాడా? అన్నది సస్పెన్స్. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్ నిర్మించింది.