Begin typing your search above and press return to search.

సలార్ సెన్సార్.. రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాక్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న నెక్స్ట్ బిగ్ బడ్జెట్ మూవీ సలార్. బాహుబలి తర్వాత సరైన సక్సెస్ చూడకపోయినప్పటికీ ప్రభాస్ రేంజ్ కొంచెం కూడా తగ్గలేదు.

By:  Tupaki Desk   |   9 Dec 2023 11:55 AM GMT
సలార్ సెన్సార్.. రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాక్
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న నెక్స్ట్ బిగ్ బడ్జెట్ మూవీ సలార్. బాహుబలి తర్వాత సరైన సక్సెస్ చూడకపోయినప్పటికీ ప్రభాస్ రేంజ్ కొంచెం కూడా తగ్గలేదు. ఒక విధంగా ప్రతి సినిమాకు ప్రభాస్ రేంజ్ అమాంతంగా పెరిగిపోతుంది. అందుకు కారణం ప్రభాస్ ఓకే తరహా సినిమాలు కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ జానర్ లలో సినిమాలు చేస్తూ ఉన్నాడు

ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసిన హై వోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు కూడా పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయడానికి సిద్ధమయింది. ఇక సెన్సార్ పనులు కూడా రీసెంట్ గానే ఫినిష్ అయినట్లుగా తెలుస్తోంది.

సెన్సార్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు A సర్టిఫికెట్ అందినట్లుగా తెలుస్తోంది. ఇక నిడివి 3 గంటలకు దగ్గరగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ కెరియర్లో ఇప్పటివరకు ఈ రేంజ్ లో రన్ టైమ్ ఉన్న సినిమా రాలేదు. ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే అడల్ట్ సెన్సార్ రావడం ఒక విధంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటివరకు ప్రభాస్ సినిమాలకు కూడా దేనికి ఈ తరహా సెన్సార్ అయితే జరగలేదు.

ఎందుకంటే ఈ సినిమాలో రొమాన్స్ లాంటి సీన్స్ ఎక్కువగా లేవు కానీ యాక్షన్ లో మాత్రం దర్శకుడు రక్తపాతాన్ని ఎక్కువగా హైలెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రం ఊహించని స్థాయిలో ఉంటాయి అని అర్థమవుతుంది. ఇక ఈ సినిమా నిడివి రెండు గంటల 56 నిమిషాల వరకు ఫిక్స్ అయినట్లుగా టాక్. దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా వరకు కొన్ని సన్నివేశాలను కట్ చేసినట్లుగా తెలుస్తోంది.

అలాగే సెన్సార్ కూడా మరికొన్ని సన్నివేశాలపై అభ్యంతరం చెప్పడంతో తీసేయాల్సి వచ్చిందని ఒక టాక్ అయితే వినిపిస్తోంది. మొత్తానికి గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ప్రభాస్ సినిమాకు సెన్సార్ అయితే జరిగింది. మరి ఫ్యామిలీ అంతా ప్రభాస్ సినిమా కలిసి చూడాలని అనుకుంటారు. అలాంటిది ఇప్పుడు A సర్టిఫికెట్ వస్తుంది అంటే ఆ ప్రభావం ఏదైనా పడుతుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ను వారం తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది.