Begin typing your search above and press return to search.

సలార్.. భయాంకర టిక్కెట్?

ముఖ్యంగా మల్టీప్లెక్స్ లో 330 నుంచి 400 వరకు ఒక్కో టిక్కెట్ అమ్ముడు కానుంది. ఇక సింగిల్ స్క్రీన్స్ లలో మాత్రం ప్రస్తుతం ఉన్న రేటుకు మరో 30 రూపాయలు అదనంగా పెరగవచ్చు.

By:  Tupaki Desk   |   13 Dec 2023 3:00 AM GMT
సలార్.. భయాంకర టిక్కెట్?
X

బిగ్గెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకు వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే సినిమా ట్రైలర్ విడుదల చేయగా దాని పై భిన్నమైన టాక్స్ వచ్చాయి. ఇక సినిమా కంటెంట్ మాత్రం బలంగా ఉంటుంది అని ఫ్యాన్స్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు.

ఇక మరోవైపు సెకండ్ ట్రైలర్ కూడా రావచ్చని టాక్ వచ్చింది. అలాగే సాంగ్ కూడా రాబోతోంది. డిసెంబర్ 22న రాబోతున్న సలార్ ను మొదటి రోజు మొదటి షో చూడడానికి ఫ్యాన్స్ అయితే చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా టిక్కెట్ల రేట్లు కూడా పెరగవచ్చు అని టాక్ అయితే గట్టిగానే వస్తోంది. ఏపీ లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు కానీ తెలంగాణలో అయితే ప్రస్తుతం ఉన్న టిక్కెట్ల రేటుకు 100 రూపాయల వరకు పెరగవచ్చని టాక్ వస్తోంది.

ముఖ్యంగా మల్టీప్లెక్స్ లో 330 నుంచి 400 వరకు ఒక్కో టిక్కెట్ అమ్ముడు కానుంది. ఇక సింగిల్ స్క్రీన్స్ లలో మాత్రం ప్రస్తుతం ఉన్న రేటుకు మరో 30 రూపాయలు అదనంగా పెరగవచ్చు. ముఖ్యంగా నైజాం ఏరియాలో సలార్ రేట్లు హాట్ టాపిక్ గా మారబోతున్నాయి. ఇక నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

మైత్రి సంస్థ ఏకంగా ఆరు షోల పర్మిషన్ కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే కొంత వరకు లాభం చేకూరే అవకాశం ఉంది. అసలే సినిమా టాక్ ఎలా ఉంటుందో అనే అనుమానాలు గట్టిగానే వస్తున్నాయి. మరోవైపు షారుఖ్ డుంకి పోరు తప్పదు. కాబట్టి ఆరు షోలు ఆదనపు రేట్లు బాగా కలిసి వచ్చే అంశమే. టాక్ బాగుంటే లాభమే కానీ తేడా వస్తే మొదటికే మోసం వస్తుంది.

అయితే ఫ్యాన్స్ వరకు ఎలాగో ఎగబడి చూడడం పక్కా కానీ ఆ తరువాత కలెక్షన్స్ పెరగాలి అంటే మిగతా సినీ లవర్స్ పరిస్థితి ఏంటి? సలార్ కోసం ఆ రేంజ్ లో ఖర్చు చేయగలరా? ఇక ఫ్యామిలీ ఆడియెన్స్ వస్తారా రారా అనేది కాలమే నిర్ణయించాలి. సినిమా టిక్కెట్ల రేట్ల విషయం అయితే నిర్మాతలు బాధ్యత తీసుకున్నట్లు టాక్. అధిక రేటుకు సినిమాను అమ్మిన హోంబెల్ టిక్కెట్ల రేటును పెంచే విధంగా అడుగులు వేస్తోంది. మరి కొంత ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి వారికి ఎలాంటి సపోర్ట్ వస్తుందో చూడాలి. ఏదేమైనా ఆరు షోలు, టిక్కెట్ల రేట్ల పెరుగుదల, అలాగే సినిమాకు పాజిటివ్ టాక్.. అంతా కలిసొస్తేనే మైత్రి నిర్మాతలకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి.