'యానిమల్'పై 'సలార్' పైచేయి!
అయితే ఈ సినిమాల అడ్వాన్స్ బుకింగులకు సంబంధించిన రిపోర్టులు ఇప్పుడు అభిమానుల్ని ఎగ్జయిట్ చేస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగుల్లో ఇప్పుడు సలార్ హవా కనిపిస్తోందని ట్రేడ్ చెబుతోంది.
By: Tupaki Desk | 25 Nov 2023 2:28 PM GMT2023 ముగింపు ఘనంగా ఉండబోతోంది. బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా? అంటూ ఢీకొట్టే బాహుబలులు బరిలో దిగుతున్నారు. ఇందులో ప్రభాస్ - సలార్, రణబీర్ - యానిమల్, షారూఖ్ - డంకీ సినిమాలున్నాయి. ఈ మూడు చిత్రాలు అత్యంత భారీ అంచనాల నడుమ బరిలో దిగుతున్నాయి.
అయితే ఈ సినిమాల అడ్వాన్స్ బుకింగులకు సంబంధించిన రిపోర్టులు ఇప్పుడు అభిమానుల్ని ఎగ్జయిట్ చేస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగుల్లో ఇప్పుడు సలార్ హవా కనిపిస్తోందని ట్రేడ్ చెబుతోంది. సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ సంచలనంగా మారుతున్నాయనేది తాజా నివేదిక. ప్రభాస్ నటించిన ఈ చిత్రం USలో రణబీర్ కపూర్ 'యానిమల్'ను అధిగమించింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగుల రూపంలో $153,359 వసూలు చేస్తోందని ట్రేడ్ చెబుతోంది.
డిసెంబరు 22న విడుదల కానున్న ప్రభాస్ 'సలార్: పార్ట్ 1: సీజ్‌ఫైర్' యుఎస్‌లో ముందస్తు బుకింగ్ ల్లో రికార్డులు సృష్టిస్తోంది. ప్రీమియర్‌ల ద్వారా ఇప్పటికే $153,359 మేర బాక్సాఫీస్ కలెక్షన్‌లు సాధించిందని ఒక నివేదిక తెలిపింది. శుక్రవారం వరకు 182 స్థానాల్లోని 565 షోల నుండి 5,854 టిక్కెట్లు అమ్ముడయ్యాయని మీడియాలో కథనాలొస్తున్నాయి. భారతదేశంలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లు ఇంకా ఓపెన్ కానప్పటికీ అమెరికాలో ఈ చిత్రం ప్రస్తుతం రణబీర్ కపూర్ యానిమల్ కంటే $100,000 తేడాతో అడ్వాన్స్ బుకింగ్ రేసులో ముందుంది.
హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన 'సలార్: పార్ట్ 1: సీజ్ ఫైర్'లో ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు నటించనున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 22 డిసెంబర్ 2023న భారతదేశంలోని థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం SRK - డుంకీతో పోటీ పడనుంది. ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయాలని భావించారు. కానీ షారుఖ్ ఖాన్ జవాన్‌తో పోటీపడకుండా ఉండేందుకు విడుదలను వాయిదా వేసారు. అయితే ఈ వాదనను మేకర్స్ ఖండించారు. ప్రస్తుతం సలార్ టీమ్ ఈ చిత్రానికి చివరి మెరుగులు దిద్దుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జవాన్ కి గండం తప్పినా ఖాన్ నటించిన డంకీకి సలార్ గండం తప్పదన్న చర్చా వేడెక్కిస్తోంది. డిసెంబర్ 1 రాత్రి 7:19 గంటలకు 'సలార్' ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఐమాక్స్ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్ని పంపిణీ చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
సలార్ శాటిలైట్, ఆడియో - డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను విక్రయించడం ద్వారా ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో దూసుకెళ్లింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు 165 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ సినిమా హక్కుల కోసం మైత్రీ మూవీ మేకర్స్‌తో 60 కోట్ల రూపాయల డీల్ కూడా కుదిరింది. సలార్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.