సలార్ VS డుంకీ... 15 రోజుల ముందే ఆ క్లారిటీ రానుందా?
ఇలాంటి సమయంలో పదిహేను రోజుల ముందే ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది అని ఆసక్తికర విషయం వెల్లడి కాబోతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 5 Dec 2023 4:30 PM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫిలిం మేకర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఒక్క రోజు ముందు అంటే డిసెంబర్ 21న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన డుంకీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ రెండు సినిమాలపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. షారుఖ్ ఖాన్ గత రెండు చిత్రాలు వేయి కోట్ల వసూళ్ల ను నమోదు చేసిన నేపథ్యం లో ఈ చిత్రం పై కూడా అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కు రాజ్ కుమార్ హీరాని దర్శకత్వం వహించడం వల్ల అంచనాలు అంతకు మించి అన్నట్లుగా ఉన్నాయి అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ఇక సలార్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల విడుదలైన సలార్ ట్రైలర్ బద్దలు కొట్టిన రికార్డులను చూస్తూ ఉంటే ఈజీగా రూ. 1000 కోట్ల వసూలు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ ప్రభాస్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే సలార్ కి డుంకీ కచ్చితంగా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి.
ఇలాంటి సమయంలో పదిహేను రోజుల ముందే ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది అని ఆసక్తికర విషయం వెల్లడి కాబోతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సలార్ ట్రైలర్ విడుదల అయింది. మరికొన్ని గంటల్లో షారుక్ ఖాన్ నటించిన డుంకీ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సలార్ ట్రైలర్ సృష్టించిన రికార్డులను డుంకీ బ్రేక్ చేస్తే కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సలార్ పై డుంకీ పై చేయి సాధించినట్లు అవుతుంది అంటూ కొందరు సినీ ఔత్సాహికులు కామెంట్ చేస్తున్నారు. యూట్యూబ్లో ఆధిపత్యాన్ని కనబరిచినట్లయితే బాక్సాఫీస్ వద్ద కూడా షారుక్ ఖాన్ ఆధిపత్యం కనబరిచే అవకాశాలు ఉంటాయి అన్నట్లుగా కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కొందరు మాత్రం ట్రైలర్ కి సినిమాకు చాలా తేడా ఉంటుంది. కనుక యూట్యూబ్ రికార్డుల వల్ల బాక్సాఫీస్ వద్ద ఫలితాలు మారుతాయి అనుకోవడం పొరపాటు అన్నట్లుగా కొందరు విశ్లేషిస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే మరో 15 రోజులు వెయిట్ చేయాల్సిందే. రెండు సినిమాల మధ్య పోటీ, విజేత విషయంలో ఇప్పుడే క్లారిటీ రావడం అనేది సాధ్యం కాదు.