Begin typing your search above and press return to search.

సలార్ vs డుంకీ.. పోటీలో ఇది కూడా పెద్దదే

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇద్దరు బిగ్ స్టార్ డిసెంబర్ 22న పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Oct 2023 1:30 AM GMT
సలార్ vs డుంకీ.. పోటీలో ఇది కూడా పెద్దదే
X

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇద్దరు బిగ్ స్టార్ డిసెంబర్ 22న పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీతో థియేటర్స్ లోకి రానుండగా అదే రోజు డుంకీ చిత్రంతో షారుఖ్ ఖాన్ ప్రేక్షకుల ముందుకొచ్చి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సౌత్ ఇండియన్ మార్కెట్ లో సలార్ ఆధిపత్యం చూపించే అవకాశం ఉంది.

నార్త్ లో షారుఖ్ ఖాన్ డుంకీ చిత్రానికి కొంత ఎడ్జ్ ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే రెండు సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో షారుఖ్ ఖాన్ జోరు మీద ఉన్నారు. రాజ్ కుమార్ హిరానీలాంటి టాలెంటెడ్ దర్శకుడి నుంచి ఈ మూవీ వస్తోంది. ఈ రెండు కూడా డుంకీపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. అలాగే డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సలార్ కోసం ఆకలితో వెయిట్ చేస్తున్నారు.

ఈ రెండు చిత్రాల సంగతి ఎలా ఉన్న అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం సలార్, డుంకీ చిత్రాలకి మరో ప్రమాదకర పోటీ ఎదురవుతోంది. అదే అక్వామెన్ 2. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చే ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ భాగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. వరల్డ్ వైడ్ గా ఇంగ్లీష్ తో పాటు ఇండియన్ భాషలలో కూడా అక్వామెన్ రిలీజ్ చేయబోతున్నారు.

హాలీవుడ్ చిత్రాలు ఇష్టపడే వారికి ఆక్వామెన్ కనెక్ట్ అవ్వొచ్చు. అయితే ఈ మధ్యకాలంలో అవతార్ 2 తర్వాత వచ్చిన ఏ హాలీవుడ్ సినిమా ఇండియన్ మార్కెట్ లో పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే గతంలో వచ్చిన అక్వామెన్ సూపర్ సక్సెస్ అయ్యింది. పిల్లలు ఎక్కువగా ఈ చిత్రాన్ని ఆశ్వాదించారు. ఇప్పుడు డానికి సీక్వెల్ గా ఆక్వామెన్ 2 రాబోతోంది.

డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మరి సలార్, డుంకీ చిత్రాలకి ఈ ఆక్వామెన్ పోటీ ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో మాత్రం ఈ ఆక్వామెన్ తో ఇండియన్ స్టార్ చిత్రాలకి ఎంతోకొంత ప్రతిబంధకం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.