సలార్.. అసలు ఏం ప్లానింగ్ ఇది
అయితే దర్శకుడు ప్రశాంత్ అయినా సరే ప్రభాస్ ను ఈసారి పర్ఫెక్ట్ గా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడు అనుకుంటే అతను కూడా బ్యాక్ టు బ్యాక్ షాకుల మీద షాకులు ఇస్తున్నాడు.
By: Tupaki Desk | 2 Dec 2023 12:30 PM GMTబాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కు అసలు టైం కలిసి రావడం లేదు. పొరపాటు ఎక్కడ జరుగుతుందో ఏమో కానీ ప్రతి సినిమా విషయంలోనూ చాలా కన్ఫ్యూజన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఇక చివరికి ఆ కన్ఫ్యూజన్ సినిమా ఫలితం పై ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. అయితే దర్శకుడు ప్రశాంత్ అయినా సరే ప్రభాస్ ను ఈసారి పర్ఫెక్ట్ గా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడు అనుకుంటే అతను కూడా బ్యాక్ టు బ్యాక్ షాకుల మీద షాకులు ఇస్తున్నాడు.
300 కోట్ల వరకు ఖర్చుచేసి తీసిన సినిమా నుంచి కనీసం ప్రభాస్ కు సంబంధించిన పది పోస్టర్లు కూడా విడుదల చేయలేదు. ఇక టీజర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ ఫేస్ చూపించకుండా మొదటి సారి ఒక టీజర్ను రిలీజ్ చేసి ట్రోలర్స్ ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు అయితే ఆ టీజర్ వచ్చిన తర్వాత ట్రోలర్స్ అయితే ఒక రేంజ్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తున్నారు.
కనీసం ట్రైలర్ లో అయినా ప్రభాస్ మొహాన్ని చూపిస్తారా లేదా అనేలా కామెంట్స్ వచ్చాయి. అయితే అలా జరగకూడదు అని అనుకున్న ఫ్యాన్స్ కు ఇక్కడ కూడా దర్శకుడు షాక్ ఇచ్చాడు. ట్రైలర్ సగం ముగిసిన తర్వాత ప్రభాస్ ఫేస్ చూపించారు. అది కూడా అంత సంతృప్తిగా ఏమీ లేదు. అయితే ఇప్పుడు సినిమాలో అయినా ప్రభాస్ ను పూర్తిగా చూపిస్తారా? లేదంటే సగం సగం చూపిస్తారా అనేలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి.
అసలు ప్రభాస్ ను పూర్తిస్థాయిలో పర్ఫెక్ట్ గా మెప్పించే విధంగా చూపించకపోవడానికి కారణాలు ఏమై ఉంటుందో అనే కన్ఫ్యూజన్స్ పుట్టుకొస్తున్నాయి. ప్రభాస్ లుక్ బాలేకపోవడమా? లేక అంచనాలను తగ్గించడానికి దర్శకుడు ఈ విధమైన ప్రయోగం చేస్తున్నాడా? లేదంటే ప్రభాస్ కు సంబంధించిన సీన్లు ఎక్కువగా హైలెట్ చేయకుండా అతనిని పూర్తిస్థాయిలో థియేటర్లోనే చూడాలి అని అనేలా మరొక తరహాలో ప్రయోగాలు చేస్తున్నారా అని సందేహాలు వస్తున్నాయి.
ఇక వీటికి తోడు ఈ సినిమా దాదాపు KGF తరహా లోనే ఉంది అనేలా కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే సలార్ కు సంబంధించిన మరొక ట్రైలర్ కూడా విడుదల చేయాలి అని ఆలోచిస్తున్నట్లు ఒక టాక్ అయితే వినిపించింది. అందులో ప్రభాస్ క్యారెక్టర్ ను హైలెట్ చేసే విధంగా రెడీ చేస్తున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒకవేళ నిజమైతే మాత్రం సినిమాకు చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. వీలైనంతవరకు ప్రభాస్ కటౌట్ పూర్తిస్థాయిలో ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా మరొక ట్రైలర్ను విడుదల చేస్తే సినిమా ఓపెనింగ్స్ కు చాలా మంచిది. మరి దర్శకుడు ఏవైనా అలా ఏమైనా సర్ ప్రైజ్ లు ఇస్తాడో లేదో చూడాలి.