హీరో ని బెదిరించిన వాడి IP అడ్రెస్ సెర్చ్!
బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ మరోసారి టెన్షన్ లో ఉన్నాడు. ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ భిస్నోయ్ నుండి అతడికి తాజాగా బెదిరింపులు ఎదురయ్యాయి.
By: Tupaki Desk | 30 Nov 2023 4:32 AM GMTబాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ మరోసారి టెన్షన్ లో ఉన్నాడు. ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ భిస్నోయ్ నుండి అతడికి తాజాగా బెదిరింపులు ఎదురయ్యాయి. తాజా బెదిరింపుల నేపథ్యంలో ముంబై పోలీసులు పరిస్థితిని సమీక్షించి అతడికి భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రాణహాని కారణంగా ఇప్పటికే సల్మాన్ కి వై ప్లస్ భద్రత కల్పించారు. పంజాబీ గాయకుడు-నటుడు గిప్పీ గ్రేవాల్‌ను ఉద్దేశించి ఫేస్‌బుక్ పోస్ట్‌లో గ్యాంగ్‌స్టర్‌గా చెప్పుకునే ఖాతాలో ఇలా రాసారు. మీరు సల్మాన్ ఖాన్‌ను సోదరుడిగా భావిస్తారు.. కానీ ఇప్పుడు మీ తమ్ముడు వచ్చి మిమ్మల్ని రక్షించే సమయం వచ్చింది. ఈ సందేశం కూడా సల్మాన్ ఖాన్ .. దావూద్ నిన్ను రక్షిస్తాడనే భ్రమలో ఉండకు.. నిన్ను ఎవరూ రక్షించలేరు. సిద్ధు మూస్ వాలా మరణంపై మీ నాటకీయ స్పందన ఎవరూ పట్టించుకోలేదు. అతడు ఎలాంటి వ్యక్తి అన్నది.. అతడికి ఉన్న నేరస్తుల సంఘాలు ఎలాంటివి అన్నది మనందరికీ తెలుసు. ... మీరు ఇప్పుడు మా రాడార్‌పైకి వచ్చారు. దీనిని ట్రైలర్‌గా పరిగణించండి. పూర్తి చిత్రం త్వరలో విడుదల చేయబడుతుంది. మీరు కోరుకున్న ఏ దేశానికైనా పారిపోండి.. కానీ గుర్తుంచుకోండి, మరణానికి వీసా అవసరం లేదు.. ఇది ఆహ్వానం లేకుండా వస్తుంది! అని లేఖ రాసారు.
ఈ నెల ప్రారంభంలో కెనడా వాంకోవర్‌లోని గ్రేవాల్ ఇంటి వెలుపల తుపాకీ కాల్పులు జరిగాయి. భిస్నోయ్ అతని గ్యాంగ్ దీనికి బాధ్యత వహించారు. ఈ సంఘటన తర్వాత, గ్రేవాల్ తన జీవితంలో దబాంగ్ నటుడు సల్మాన్ ని రెండుసార్లు మాత్రమే కలిశానని స్పష్టం చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో సల్మాన్ అసిస్టెంట్‌కి బెదిరింపు ఇమెయిల్ వచ్చినప్పటి నుండి, అతని భద్రతను కట్టుదిట్టం చేశారు. వ్యక్తిగత ఆయుధాలను కలిగి ఉండే లైసెన్స్‌తో పాటు వై ప్లస్ కేటగిరీ కూడా ఇచ్చారు. సల్మాన్ కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా కొనుగోలు చేశాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపులకు పాల్పడిన అతని సహాయకుడు గోల్డీ బ్రార్‌పై కూడా కేసు నమోదైంది.
బెదిరింపు నేపథ్యంలో ముంబై పోలీసులు ఈ పోస్ట్‌పై వివరాల కోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌కు లేఖ రాశారు. లొకేషన్‌ను ట్రాక్ చేయడానికి ఖాతా ప్రామాణికతను ధృవీకరించడానికి అధికారులు IP చిరునామాను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు.