సలార్ విలన్ నెక్ట్స్ రజనీతోనే ఢీ!
ఇకపై లోకేష్ నెక్ట్స్ ఆపరేషన్ ఏమిటి? అంటే.. అతడు సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమాని పట్టాలెక్కించడమేనని అభిమానులు చెబుతున్నారు.
By: Tupaki Desk | 23 Oct 2023 12:30 PMకోలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ పనితనం గురించి చెప్పాల్సిన పని లేదు. ఖైదీ-విక్రమ్ చిత్రాలతో సంచలనాలు సృష్టించిన అతడు ప్రస్తుతం దళపతి విజయ్ లియో ఘనమైన ఓపెనింగులతో స్కైలైన్ లో చేరాడు. లియోకి ఇంత బజ్ తెచ్చింది ముఖ్యంగా కాంబినేషన్ అని అంగీకరించాలి. విజయ్ లాంటి మాస్ స్టార్ కి మాస్ సినిమాలతో సత్తా చాటిన లోకేష్ కనగరాజ్ కలయిక సాధ్యమవ్వడమే ఈ భారీ ఓపెనింగులకు కారణం. సమీక్షలతో సంబంధం లేకుండా లియో చిత్రం 300 కోట్ల క్లబ్ లో చేరిందని కబురందింది.
ఇకపై లోకేష్ నెక్ట్స్ ఆపరేషన్ ఏమిటి? అంటే.. అతడు సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమాని పట్టాలెక్కించడమేనని అభిమానులు చెబుతున్నారు. నిజానికి లియో తెరపైకి రాకముందే, లోకేశ్ కనగరాజ్ లెజెండరీ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తాత్కాలికంగా `తలైవర్ 171` అనే పేరుతో ప్రాజెక్ట్‌ను ప్రకటించడం వేవ్స్ క్రియేట్ చేసింది. తాజా సమాచారం మేరకు.. తలైవర్ 171లో మాలీవుడ్ స్టార్ హీరో, సలార్ విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
భారీ అంచనాలతో తెరకెక్కనున్న తలైవర్ 171 చిత్రం 2024 మార్చి లేదా ఏప్రిల్‌లో చిత్రీకరణను ప్రారంభించే అవకాశం ఉంది. ఇంకా లోకేష్ బృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి ఈ సినిమా కాస్టింగ్ ఎంపికల దశలో ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పటికే ప్రభాస్ తో భారీ యాక్షన్-ప్యాక్డ్ చిత్రం సాలార్‌లో విలన్ గా ఢీకొంటున్నాడు. ఈ చిత్రం 22 డిసెంబర్ 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.