Begin typing your search above and press return to search.

అమ్మ మ‌ర‌ణం గురించి అంత చెడ్డ‌గా మాట్లాడారు!

బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో హీరోయిన్ అల‌రించిన లెజెండ‌ర‌నీ హాస్య న‌టి గిరిజ. 1950లలో `పరమానందయ్య శిష్యుల కథ` సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   17 Sep 2024 12:30 PM GMT
అమ్మ మ‌ర‌ణం గురించి అంత చెడ్డ‌గా మాట్లాడారు!
X

బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో హీరోయిన్ అల‌రించిన లెజెండ‌ర‌నీ హాస్య న‌టి గిరిజ. 1950లలో `పరమానందయ్య శిష్యుల కథ` సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అటుపై మూడున్నర దశాబ్దాల పాటు న‌టిగా ప్ర‌స్థానం కొన‌సాగించారు. అప్ప‌ట్లోనే 300లకి పైగా సినిమాలలో నటించారు. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఆమెకంటూ ప్ర‌త్యేక స్థానం ఉంది. అలాంటి న‌టి చివ‌రి రోజులు ఎంతో విషాద‌క‌రంగా ముగిసాయ‌ని అంటుంటారు. ఆమె త‌ర్వాత కాలంలో ఆమె పిల్ల‌లు..ఇత‌రులు ఎవ‌రూ కూడా ఇండ‌స్ట్రీలోకి రాలేదు. దీంతో గిరిజ విష‌యాలేవి పెద్ద‌గా బ‌య‌ట‌కు రాలేదు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూ ద్వారా గిరిజ కుమార్తు సలీమా ట‌చ్ లోకి వ‌చ్చారు. ఆమె త‌ల్లి గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు ఆమె మాట‌ల్లో..

`మా అమ్మగారిది గుడివాడ. ట్రంక్ పెట్టెలో బట్టలు పెట్టుకుని 'చెన్నపట్టణంస వెళ్లిన‌ట్లు నాతో చెప్పేది. అప్పటికే ఆమె నాటకాలు వేస్తూ ఉండేది . బీఏ కూడా పూర్తి చేసింది. 'పాతాళభైరవవి` సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. అప్పట్లో రేలంగి - అమ్మ లేని సినిమా ఉండేది కాదు. కార్లు .. బంగ్లాలు .. నౌకర్లు .. ఇలా విలాసవంతమైన జీవితం చూశాను. కానీ ఆ తరువాత అవన్నీ మాయ‌మ‌య్యాయి.

మా అమ్మకి చాలా గొప్ప సంబంధాలు వచ్చాయట. కానీ ఆమె ఒక డిస్ట్రిబ్యూటర్ ను పెళ్లి చేసుకుంది. అతను రోజు తాగొచ్చి అమ్మను కొట్టేవాడు. చిన్నపిల్లనని చూడకుండా నన్నూ కొట్టేవాడు. ఆయన చేసిన సినిమా బిజినెస్ వలన నష్టాలు వచ్చాయి. ఆయన ఇల్లొదిలి వెళ్లిపోయాడు. ఆ అప్పులు తీర్చడం కోసం మా ఆస్తులన్నీ అమ్మాల్సి వచ్చింది. అలా ఆర్ధికంగా కష్టాలు పడింది. నాన్న పెట్టే హింస .. అమ్మ కష్టాలు చూస్తూనే పెరిగాను.

నా అసలు పేరు కాళేశ్వరి . అమ్మ మతం మారినప్పుడు సలీమా అనే పేరు పెట్టారు. అమ్మపేరు కూడా 'కరీమా బేగం'గా మార్చుకుంది .. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. నా 20 ఏళ్ల వయసులో అమ్మ చనిపోయింది. ఆ సమయంలో శోభన్ బాబు గారు .. అల్లు రామలింగయ్య గారు తప్ప, ఇండస్ట్రీ నుంచి ధైర్యం చెప్పినవారు లేరు. అమ్మ దిక్కులేని స్థితిలో బస్టాండులో చనిపోయారనే ప్రచారం నాకు బాధను కలిగించింది.. అందులో నిజం లేదు. మా అమ్మ మా ఇంట్లోనే చనిపోయింది` అన్నారు.