నారీ నారీ నడుమ స్టార్ రైటర్ ఇక్కట్లు
తాజా ఇంటర్వ్యూలో అలాంటి ఒక ప్రశ్నను ఎదుర్కొన్న స్టార్ రైటర్ సలీమ్ ఖాన్ తన ఇద్దరు భార్యల గురించి వెల్లడించాడు.
By: Tupaki Desk | 15 Jan 2025 5:01 AM GMTప్రముఖ స్క్రీన్ రైటర్ నారీ నారీ నడుమ నలిగిపోయిన కథ .. కొడుకు పెద్ద సూపర్ స్టార్ అయినా కానీ 50 వయసులోను సింగిల్ గా మిగిలిపోయిన కథ.. ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్. ఇటీవల ఈ వ్యవహారంపై మీడియా రచ్చ మరింత ఎక్కువైంది. 50 ప్లస్ వయసులోను పెద్ద కొడుకు సల్మాన్ ఖాన్ పెళ్లి చేయని తండ్రిగా స్టార్ రైటర్ సలీమ్ ఖాన్ ని హిందీ మీడియా నిలదీస్తోంది. వ్యక్తిగత జీవితాలను తరచి తరచి చూసే మీడియా హద్దులు చెరిపేసి చెలరేగుతుంటే కొందరికి ఇది ఇబ్బందికరంగా మారుతోంది.
తాజా ఇంటర్వ్యూలో అలాంటి ఒక ప్రశ్నను ఎదుర్కొన్న స్టార్ రైటర్ సలీమ్ ఖాన్ తన ఇద్దరు భార్యల గురించి వెల్లడించాడు. వారిద్దరినీ ప్రశంసిస్తూ ''నాకు ఇద్దరు భార్యలు ఉండటం .. వారు సామరస్యంగా జీవించడం నా అదృష్టం. కొన్ని సంవత్సరాల తరువాత అలా జరిగితే పర్వాలేదు. నా భార్యలు అందంగా ఉన్నారు. ఇప్పుడు వారు అందంగా వృద్ధులు అవుతున్నారు'' అంటూ ఛమత్కరించారు సలీంఖాన్.
మొదటి భార్య సల్మాకు.. హెలెన్‌తో రిలేషన్‌లో కొన్ని సమస్యలు ఉన్నాయని వెల్లడించాడు. రెండో భార్య గురించి నేను మొదటి భార్యకు చెప్పినప్పుడు .. నేను అద్భుతమైన పని చేసానని చెప్పలేదు. వాస్తవానికి మా మధ్య అప్పటికే సమస్యలున్నాయి.. కానీ చాలా తక్కువ కాలం మాత్రమే. ఆ తర్వాత సల్మా ప్రతిదీ అంగీకరించింది'' అని సలీం ఖాన్ అన్నారు.
నేను నా పిల్లలను ఒకటే కోరాను. నా జీవితంలో మరొక వ్యక్తి ఉంది. తనను మీ తల్లితో సమానంగా ప్రేమించమని అడగను.. గౌరవించమని అభ్యర్థించినట్టు సలీంఖాన్ వెల్లడించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ సోదరుడు ఆర్భాజ్ ఖాన్ మాట్లాడుతూ.. మా అమ్మ నాన్న ఇలా చేసారని చెప్పి ఇబ్బందులకు గురి చేయాలని కోరలేదని తెలిపారు. బాలీవుడ్ రచయిత సలీం ఖాన్ 1960లలో సల్మా ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. 1980లలో హెలెన్‌ను వివాహం చేసుకున్నాడు. జావేద్ తో కలిసి సలీంఖాన్ హిందీ సినీపరిశ్రమకు అద్భుతమైన స్క్రీన్ ప్లేలను అందించిన సంగతి తెలిసిందే. స్టార్ రైటర్ కి సల్మాన్ ఖాన్- ఆర్భాజ్ ఖాన్- సోహైల్ ఖాన్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు.