Begin typing your search above and press return to search.

ప్ర‌ముఖ నాయ‌కుడి హ‌త్య‌కు స్టార్‌హీరో క‌నెక్ష‌న్ లేదు

తాజా ఇంటర్వ్యూలో NCP నాయకుడి హత్యకు కార‌ణం సల్మాన్ ఖాన్‌తో సాన్నిహిత్యమే క‌దా? అని స‌లీం ఖాన్ ని ప్ర‌శ్నించ‌గా, స‌ల్మాన్ కు, బాబా సిద్ధిక్ హత్యకు ఎటువంటి సంబంధాలు కనిపించడం లేదని అన్నారు.

By:  Tupaki Desk   |   19 Oct 2024 10:34 AM GMT
ప్ర‌ముఖ నాయ‌కుడి హ‌త్య‌కు స్టార్‌హీరో క‌నెక్ష‌న్ లేదు
X

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కి డెడ్లీ వార్నింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. బాంద్రాలో ఇంటిపై కాల్పుల క‌ల‌క‌లం అనంత‌రం, స‌ల్మాన్ ఖాన్ స్నేహితుడైన బాబా స‌ద్ధిఖ్ ని బిష్ణోయ్ గ్యాంగ్ హ‌త‌మార్చారు. ఇది స‌ల్మాన్ కి ఫైన‌ల్ వార్నింగ్. కానీ దీనిని సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ ఖండిస్తున్నారు.

NCP నాయకుడు బాబా సిద్ధిక్ హత్యకు, సూపర్‌స్టార్ స‌ల్మాన్‌కి మధ్య ఎటువంటి సంబంధం లేదని, దానికి వేరే స‌మ‌స్య కార‌ణ‌మ‌ని సలీంఖాన్ అన్నారు. ప్ర‌ముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సల్మాన్ భ‌యాందోళ‌న‌ల‌కు సిద్ధిక్ హత్య ఒక కార‌ణ‌మ‌ని ఆయ‌న అంగీక‌రించ‌లేదు. ఏడాది కాలంగా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్మాన్ ప్రాణాపాయ బెదిరింపులను ఎదుర్కొన్నా స‌లీంఖాన్ ఇంకా దీనిపై హైడ్ చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

గ్యాంగ్ స్ట‌ర్ బెదిరింపులు ఇప్పుడు ప‌రాకాష్ట‌కు చేరుకోవ‌డంతో ఖాన్ ఇంటి పరిస్థితి ఇటీవల మరింత దిగజారింది. బాబా సిద్ధిక్ హత్యతో స‌ల్మాన్ కి డెడ్లీ వార్నింగ్ ఇచ్చిన‌ట్ట‌యింది. కేవ‌లం స‌ల్మాన్ తో సన్నిహితంగా ఉన్నవారిని మరింత ఆందోళనకు గురి చేసింది ఈ హ‌త్య‌. సిద్దిక్ హంతకులు బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని పేర్కొనడం ద‌డ పుట్టించింది.

తాజా ఇంటర్వ్యూలో NCP నాయకుడి హత్యకు కార‌ణం సల్మాన్ ఖాన్‌తో సాన్నిహిత్యమే క‌దా? అని స‌లీం ఖాన్ ని ప్ర‌శ్నించ‌గా, స‌ల్మాన్ కు, బాబా సిద్ధిక్ హత్యకు ఎటువంటి సంబంధాలు కనిపించడం లేదని అన్నారు. అలాంటి కనెక్షన్ ఎలా డ్రా అవుతుందో అర్థం చేసుకోవడానికి కష్టపడుతున్నారని కూడా అన్నారు. బాబా సిద్ధిక్ హత్యలో లారెన్స్ బిష్ణోయ్ ప్రమేయం ఉన్నా కానీ.. అది సల్మాన్‌తో సంబంధం లేనిదని..దానికి ఒక ప్రత్యేక సమస్య ఉందని అన్నారు. ప్రత్యేకించి వారి మ‌ధ్య‌ ఆస్తి వివాదం ఉంద‌ని వ్యాఖ్యానించారు. గ్యాంగ్ స్ట‌ర్ బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ నివాసం చుట్టూ భద్రతను భారీగా పెంచారు. సల్మాన్ కదలికలపై ఆంక్షల కారణంగా కుటుంబం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.