సల్మాన్ ఖాన్ నటవారసుడి పరిచయం?
దీనిపై అభిమానుల్లో చాలా చర్చ సాగుతోంది. అంత పెద్ద సూపర్‌స్టార్ తనతోనే ముగింపు పలకాలని నిర్ణయించుకోవడం అభిమానులకు అర్థం కావడం లేదు.
By: Tupaki Desk | 9 Feb 2025 11:38 AM GMTబాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉన్నాడు. అతడికి పెళ్లి కాలేదు.. ఎవరైనా కథానాయిక ప్రపోజ్ చేస్తే షష్ఠిపూర్తి వయసులో ఇంకేం పెళ్లి అని అంటున్నాడు! అతడికి 60 వయసు సమీపిస్తోంది. ఇక తన నటవారసత్వాన్ని, వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లే వారసుడు ఎవరూ లేకపోవడం పెద్ద లోటు. దీనిపై అభిమానుల్లో చాలా చర్చ సాగుతోంది. అంత పెద్ద సూపర్‌స్టార్ తనతోనే ముగింపు పలకాలని నిర్ణయించుకోవడం అభిమానులకు అర్థం కావడం లేదు.
అయితే సల్మాన్ ఖాన్ అనూహ్యంగా తన వారసుడిని తెరపైకి తేబోతున్నాడనేది తాజా వార్త. అతడికి అనూహ్యంగా కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? అనే సందేహం అందరికీ ఉండొచ్చు. కానీ అతడికి వారసుడు ఉన్నాడు. తనకు పుట్టిన కొడుకు కాదు కానీ, తన సోదరుడు ఆర్భాజ్ ఖాన్ కుమారుడిని అతడు తన వారసుడిగా చూస్తున్నాడు. అతడిని ఇప్పటికే ప్రమోట్ చేయబోతున్నాడు. తన తమ్ముడు ఆర్భాజ్ ఖాన్ - మలైకా అరోరా దంపతులు జన్మించిన కొడుకునే సల్మాన్ వారసుడు అనుకుంటున్నాడు.
నిజానికి తన సోదరుడి నుంచి విడిపోయిన మలైకా చేసిన పనికి తీవ్రంగా నిరాశపడిన సల్మాన్.. ఇప్పుడు దానిని పట్టించుకోకుండా తన సోదరుడు ఆర్భాజ్ ఖాన్ కొడుకు అర్హాన్ కి పూర్తి మద్ధతునిస్తున్నారు. ఆర్హాన్ ని వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను అతడు తీసుకోబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అర్హాన్ లాంచ్ ఘనంగా ఉంటుంది..దానికి ఇంకెంతో సమయం లేదు. ఇకపోతే మలైకా తండ్రి ఆకస్మికంగా మృతి చెందినప్పుడు సల్మాన్ ఖాన్- ఆర్భాజ్ ఖాన్ సోదరులు ఆమెకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే.
తాజా పాడ్ కాస్ట్ లో సల్మాన్ తన వారసుడు అర్హాన్ ని తీవ్రంగా తిట్టాడు. దానికి కారణం వింతైనది. అసలు హిందీని ఎందుకు అనర్గళంగా మాట్లాడలేకపోతున్నావు? అంటూ సల్మాన్ తీవ్రంగా కోప్పడ్డాడు. అయితే అర్హాన్ చాలా తెలివిగా తనకు మాత్రమే కాదు.. తన స్నేహితులకు కూడా హిందీ సరిగా రాదని చెప్పాడు. అయితే సల్మాన్ ప్రతిస్పందిస్తూ..ఇక నుండి హిందీలో మాట్లాడండి.. నేను తప్పులు ఉంటే సరిదిద్దుతాను! అని అన్నాడు. అయితే హిందీ క్లాసులకు వస్తాము పెదనాన్నా అంటూ అర్హాన్ నవ్వేసాడు.
హిందీ తెలయకపోవడమా? సిగ్గుండాలి. మీరు పూర్తిగా హిందీ మాట్లాడే ప్రేక్షకులకు అనుగుణంగా ఉండాలి. కానీ హిందీ నేర్చుకోవడం కేవలం మీ కోసం చేస్తున్నారు.. ఇది సరైనదేనా? అని ప్రశ్నించాడు సల్మాన్. మీరు దీని (పాడ్‌కాస్ట్) ద్వారా డబ్బు సంపాదిస్తారా? అని కూడా సల్మాన్ ఖాన్ ఈ కార్యక్రమంలో అడిగాడు. అర్హాన్ స్వయంగా పాడ్ కాస్ట్ ని ప్రారంభించడంతో అది ఇన్ స్టంట్ గా హిట్టయింది.