2 కోట్లు కాదు 20 కోట్లు.. సల్మాన్ బుల్లెట్ ప్రూఫ్ కార్ ఖరీదు..
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి హత్యా బెదిరింపుల అనంతరం ముంబైలో పరిణామాలు సీరియస్ గా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 20 Oct 2024 1:58 PM GMTస్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి హత్యా బెదిరింపుల అనంతరం ముంబైలో పరిణామాలు సీరియస్ గా మారిన సంగతి తెలిసిందే. సల్మాన్ చుట్టూ ఐదంచెల భద్రత కనిపిస్తోంది. ఇంతలోనే అతడు దుబాయ్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ కారును దిగుమతి చేసుకున్నాడని కథనాలొచ్చాయి.
సల్మాన్ ఖాన్ దేశంలోని అతిపెద్ద స్టార్లలో ఒకడిగా ఉన్నాడు. అతడికి చాలా కాలంగా పంజాబ్ కి చెందిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో వైరం ఉంది. అందువల్ల ఏ క్షణమైనా అతడి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. బాబా సిద్ధిక్ హత్య తర్వాత, సల్మాన్‌కు భారతదేశంలో Z- కేటగిరీ భద్రత కల్పించింది ప్రభుత్వం. దీనికోసం ఏకంగా సంవత్సరానికి 3 కోట్లు పైగా ఖర్చవుతోంది.
గ్యాంగ్ స్టర్ బెదిరింపులు నెక్స్ట్ లెవల్‌కి చేరుకోవడంతో సల్మాన్ దుబాయ్ నుంచి కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారును దిగుమతి చేసుకున్నాడు. ఈ SUV నిస్సాన్ కంపెనీది. సల్మాన్ అభ్యర్థనపై ప్రత్యేకంగా తయారు చేసారని తెలిసింది. ఇది మాడిఫైడ్ ఎస్.యు.వి. తాజా కథనాల ప్రకారం ఈ కార్ రూపొందించేందుకు దాదాపు 20 కోట్ల వరకు ఖర్చవుతుందని సమాచారం. నిజానికి సల్మాన్ బుల్లెట్ ప్రూఫ్ కార్ దిగుమతి చేసుకుంటున్నాడని దీని ఖరీదు 2 కోట్లు అని కొన్ని మీడియాలు కథనాలు ప్రచురించాయి. కానీ సాధారణ ఫీచర్స్ తో ఉన్న కార్లకే కోట్లు అవుతోంది. ఇప్పుడు స్పెషల్ గా డిజైన్ చేయించుకున్నాడు గనుక దీనికి సుమారు 20 కోట్లు ఖర్చవుతుందని సోర్స్ చెబుతోంది.
సల్మాన్ కొంత గ్యాప్ తర్వాత బయటకు వచ్చి బిగ్ బాస్ షూటింగ్ ప్రారంభించాడు. తదుపరి A R మురుగదాస్ దర్శకత్వంలో తన కొత్త చిత్రం `సికందర్` షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. రిలీజ్ తేదీ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.