కళ్ల ముందు పెరిగిన అమ్మాయితో రోమాన్స్ ఏంటి?
చిరంజీవి జనరేషన్ హీరోలకు హీరోయిన్లు ఇబ్బంది ఉన్న సంగతి తెలిసిందే. ఆ స్టార్ హీరో ఇమేజ్ ని బేస్ చేసుకుని హీరోయిన్ ఎంపిక చేయాలంటే దర్శకుడికి తల ప్రాణం తోకకొస్తుంది.
By: Tupaki Desk | 4 Oct 2024 11:30 AM GMTచిరంజీవి జనరేషన్ హీరోలకు హీరోయిన్లు ఇబ్బంది ఉన్న సంగతి తెలిసిందే. ఆ స్టార్ హీరో ఇమేజ్ ని బేస్ చేసుకుని హీరోయిన్ ఎంపిక చేయాలంటే దర్శకుడికి తల ప్రాణం తోకకొస్తుంది. ఆయన ఇమేజ్..వయసు అన్నింటిని చూసుకుని తీసుకోవాలి. అలాంటి వారు తొందరగా సెట్ అవ్వరు. ఉన్న వాళ్లు అప్పటికే నటించేసి ఉంటారు? అలాగని కొత్త భామల్ని తీసుకోవాలంటే వయసు అడ్డంకిగా మారుతుంది.
అందుకే చిరంజీవి సహా నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలకు హీరోయిన్ల కోసం ప్రత్యేకంగా జల్లెడ వేసి మరీ వెతికి పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ మధ్య రవితేజ సరసన శ్రీలీల ఓ సినిమా చేస్తే...ఆయనకు డాటర్ వయసుంటుంది? ఇదేం కాబినేషన్ అన్నారు. కొన్ని విమర్శలు కూడా ఎదుర్కున్నారు. కానీ ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో అదే హీరోయిన్ తో రవితేజ మరో సినిమా చేస్తున్నాడు.
ఇప్పుడు జనాలంతా ఆ సంగతి మర్చిపోయారనుకోండి. బాలీవుడ్ లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కున్నారు సల్మాన్ ఖాన్. ఆయన హీరోగా `ప్రేమ్ రతన్ ధన్ పాయే` చిత్రాన్ని సూరజ్ బర్జాత్యా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కానీ ఇందులో సోనమ్ కపూర్ తో కలిసి నటించడానికి సల్మాన్ ఖాన్ ముందు ఒప్పుకోలేదుట. ఆమె వయసు ఏంటి? నా వయసు ఏంటి? నా కళ్ల ముందు పుట్టి పెరిగింది.
తనతో నేను ఎలా నటించగలను? ఎలా ప్రేయసిగా ఊహించుకోగలను? అని సల్మాన్ ఖాన్ వద్దు అన్నాడుట. కానీ దర్శకుడు ఎలాగూ కన్విన్స్ చేయడంతో సల్మాన్ ఒప్పుకున్నారు. సినిమా సక్సెస్ సంగతి పక్కనబెడితే సల్మాన్ ఖాన్ ఆమె తో నటించడం ఏంటి? అని రిలీజ్ అనంతరం చాలా మంది విమర్శించారుట. సల్మాన్ ఇష్టం లేకుండా ఆ పని చేసినా విమర్శలు మోయాల్సి వచ్చింది.