`సికిందర్` లో గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ హంటింగ్!
ప్రస్తుతం మురగదాస్ సల్మాన్ ఖాన్ హీరోగా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ` సికిందర్` తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ కూడా పూర్తయింది.
By: Tupaki Desk | 29 Dec 2024 6:45 PM GMTయాక్షన్ సీక్వెన్స్..క్రైమ్ సీన్స్ లో మురగదాస్ స్పెషాల్టీ గురించి చెప్పాల్సిన పనిలేదు. `గజినీ`,` తుపాకీ` తర్వాత ఆ రేంజ్ సీన్స్ మళ్లీ మరో సినిమాలో పడలేదు. కమర్శియల్ గా వివిధ సక్సెస్ లు అందుకున్నారు తప్ప! యాక్షన్ లో క్రియేటివిటీ కొరవడిందనే విమర్శలు ఎదుర్కున్నారు. మరిప్పుడు ఆ విమర్శలకు చెక్ పెట్టేలా రెడీ అవుతున్నాడా? అందుకు సల్మాన్ ఖాన్ రియల్ ఎపిసోడ్ కూడా కలిసొస్తుందా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం మురగదాస్ సల్మాన్ ఖాన్ హీరోగా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ` సికిందర్` తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొద్ది భాగం షూటింగ్ కూడా పూర్తయింది. అయితే సికిందర్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని రివీల్ అయింది. కానీ అసలు స్టోరీ ఎంటి అన్న దానిపై క్లారిటీ లేదు. అయితే ఇప్పుడీ కథలోకి మురగదాస్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎటాక్ ని జోడీస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో ఓ వార్త వెలుగులోకి వచ్చింది.
సల్మాన్ ఖాన్ పై బిష్ణోయ్ గ్యాంగ్ గురి పెట్టిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ ఘటన ఎంత సంచలనమైందో విధితమే. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ తృటిలో తప్పించుకున్నారు. ప్రతిగా బాబా సిద్దిఖీ బలైయ్యారు. అటుపై ముంబైలో ఎంతటి హైడ్రామా నడిచిందో తెలిసిందే. సెక్యురిటీ లేకుండా సల్మాన్ ఇల్లు దాటని పరిస్థితులు. బాల్కనీ లోఉ న్న సల్మాన్ పై ఎటాకింగ్..బెదిరింపు ఈ మెయిల్స్, చంపేస్తామంటూ సోషల్ మీడియా హెచ్చరికలు.
క్షమాపణలు చెబితే వదిలేస్తామంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. ఇలా రెండు నెలల పాటు బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ కి కంటి మీద కునుకు లేకుండా చేసింది. అయితే ఇప్పుడీ సన్నివేశాల్నే మురగదాస్ సికిందర్ కథలో చూపించ బోతున్నాడు? అనే ప్రచారం ఊపందుకుంది. మురగదాస్ రాసుకున్న కథకు సల్మాన్ రియల్ ఎపిసోడ్ కాస్త దగ్గరగా ఉడటంతో? మురగదాస్ ఈ సాహసానికి పూనుకున్నట్లు వినిపిస్తుంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో సినిమాలు కొత్తేం కాదు. ఛోటా రాజన్, దావూద్ ఇబ్రహీం కథలు ప్రపంచానికి తెలిసినవే. కాబట్టి మురగదాస్ ని రిస్క్ లో పడేసే అంశం కూడా కాదు. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి.