Begin typing your search above and press return to search.

సల్మాన్‌ ఖాన్‌ అలర్ట్‌ వార్నింగ్‌

స్టార్స్‌, సెలబ్రెటీల పేర్లు చెప్పి మోసాలు చేసే వారు ఎక్కువ అవుతున్నారు.

By:  Tupaki Desk   |   17 Sep 2024 5:17 AM GMT
సల్మాన్‌ ఖాన్‌ అలర్ట్‌ వార్నింగ్‌
X

స్టార్స్‌, సెలబ్రెటీల పేర్లు చెప్పి మోసాలు చేసే వారు ఎక్కువ అవుతున్నారు. సోషల్‌ మీడియాలో స్టార్స్ పేరు చెప్పి డబ్బులు వసూళ్లు చేస్తున్న వారూ ఉన్నారు. సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న వారు స్టార్స్ పేర్లను తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈవెంట్ సంస్థలు తాము నిర్వహించే కార్యక్రమాలకు హీరోలు, హీరోయిన్స్ రాకున్నా టికెట్లు అమ్ముడు పోవడం కోసం తప్పుడు ప్రచారం చేయడం, డబ్బులు దండుకోవడం చేస్తున్నారు. యూఎస్ లో జరిగే కొన్ని ఈవెంట్స్ కి బాలీవుడ్‌ స్టార్స్ హాజరు అవ్వబోతున్నారనే ప్రచారం చేయడం ద్వారా టికెట్లు ఎక్కువ మొత్తానికి అమ్ముతున్నారు.

ఇటీవల యూఎస్ కి చెందిన ఒక ఈవెంట్‌ సంస్థ తాము నిర్వహించబోతున్న ఒక ఈవెంట్‌ కు బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ హాజరు అవ్వబోతున్నాడని, తక్కువ టికెట్లు ఉన్నాయి. వెంటనే కొనుగోలు చేసిన వారికి సల్మాన్‌ ఖాన్‌ తో ఫోటో దిగే అవకాశం ఇప్పిస్తామని ప్రచారం చేశారట. దాంతో పెద్ద ఎత్తున ఆ షో కోసం టికెట్లు అమ్ముడు పోయాయి. తీరా చూస్తే ఆ ఈవెంట్‌ కు సల్మాన్‌ హాజరు అవ్వబోవడం లేదు. కేవలం ఒక స్థానిక సింగర్‌ తోనే ఆ షో ఉంటుందని తెలిసి జనాలు అవాక్కవుతున్నారు. సల్మాన్‌ ఖాన్‌ ఈ విషయమై చాలా సీరియస్‌ అయ్యాడు.

సల్మాన్‌ ఖాన్‌ ఆ విషయమై స్పందిస్తూ... తన అభిమానులు ఇలాంటి తప్పుడు ప్రచారాలకు మోస పోవద్దంటూ అలర్ట్‌ చేశాడు. మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దంటూ సున్నితంగా వార్నింగ్‌ ఇచ్చాడు. ఏదైనా ఇలాంటి ప్రకటన వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి, అధికారిక ఖాతాను పరిశీలించిన తర్వాత మాత్రమే స్పందించాలని సూచించాడు. కొన్ని వెబ్‌ సైట్స్‌ లో తాను పాల్గొనకున్నా షో లో పాల్గొనబోతున్నట్లుగా కథనాలు ఇవ్వడంను సల్మాన్‌ ఖాన్‌ తప్పుబట్టాడు. ముందు ముందు ఇలాంటివి జరగకుండా తానూ సీరియస్ గా ఉంటానని చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే తన పేరును ఉపయోగించి ఈవెంట్‌ టికెట్లను అమ్మిన సంస్థ పై చట్టపరమైన చర్యలకు సిద్ధం అయినట్లు ప్రకటించాడు. అభిమానులను ఇలాంటి మోసాల నుంచి రక్షించేందుకు సల్మాన్‌ ముందుకు వచ్చి ఇలాంటి ప్రకటన చేయడం అభినందనీయం అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సల్మాన్‌ ఖాన్ పేరుతో మాత్రమే కాకుండా అన్ని భాషల హీరోలు, హీరోయిన్స్ పేర్లతో మోసాలకు పాల్పడుతున్నారు. కనుక సల్మాన్‌ ఖాన్ వార్నింగ్‌ ను సీరియస్ గా తీసుకుని యూఎస్ ప్రేక్షకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.