క్షమాపణ చెప్పడానికి స్టార్ హీరో ఈగో అడ్డు?
అతను చాలా మందిని చంపాడు. 22 పైగా తీవ్రమైన కేసులు అతడిపై ఉన్నాయి. హిందూ దేవుళ్ళకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు హాస్యనటుడు మునవ్వర్ ఫరూఖీకి వార్నింగ్ ఇచ్చాడు.
By: Tupaki Desk | 17 Oct 2024 3:15 AM GMTతన ప్రాణాలకే ముప్పు ఉన్నా దిగి వచ్చేందుకు, క్షమాపణ చెప్పేందుకు సల్మాన్ ఖాన్ సిద్ధంగా లేరా? అంటే అవుననే తాజా పరిణామాలు చెబుతున్నాయి. బిష్ణోయ్ వర్గానికి సల్మాన్ క్షమాపణ చెప్పేందుకు ససేమిరా అనే పట్టు బడుతున్నాడు. నిజానికి సల్మాన్ ప్రాణాలకు ముప్పు ఏర్పడటం కేవలం అతడిని అతడి కుటుంబాన్ని మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను టెన్షన్‌కి గురి చేస్తోంది.
గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జైలు నుంచే ఆట ఆడుతున్నాడు. సల్మాన్ చుట్టూ ఉన్నవారిని టార్గెట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు.సల్మాన్‌ఖాన్ ఇంటిపై తొలి ఎటాక్, ఆ తర్వాత సన్నిహితుడు, ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిక్‌పై కాల్పులు జరిగినప్పటి నుంచి సల్లూభాయ్‌కి భద్రతను కట్టుదిట్టం చేశారు.
సల్మాన్ ఖాన్‌ను చంపడమే తన జీవిత నినాదమని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బహిరంగంగా హెచ్చరించాడు. లారెన్స్ బిష్ణోయ్ ఇప్పుడు గుజరాత్ జైలులో ఉన్నారు. అక్కడ నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అతను చాలా మందిని చంపాడు. 22 పైగా తీవ్రమైన కేసులు అతడిపై ఉన్నాయి. హిందూ దేవుళ్ళకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు హాస్యనటుడు మునవ్వర్ ఫరూఖీకి వార్నింగ్ ఇచ్చాడు.
ఇదంతా అలా ఉంచితే, కేవలం క్షమాపణ తో పోయేదానికి సల్మాన్ ఇంత పెద్ద ముప్పు కొని తెచ్చుకుంటున్నాడు? ఎందుకు? అని ప్రశ్నించే స్వరాలు పెరిగాయి. కేవలం ఇది ఈగో సమస్య. దానిని వదిలేసి సల్మాన్ బిష్ణోయ్ తెగకు క్షమాపణలు చెబితే సరిపోతుంది కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ బాధ్యత సల్మాన్ ఖాన్ పైనే ఉంది. అతడు తన కోసం కాకపోయినా తన చుట్టూ ప్రమాదంలో పడుతున్న వారి కోసం అయినా క్షమాపణలు చెప్పి జీవితంలోని టెన్షన్‌ని అంతం చేస్తాడా లేదా అనేది ప్రస్తుతానికి అతిపెద్ద ప్రశ్న.