నేషనల్ క్రష్ పై ఆ హీరో స్పెషల్ కేర్!
తాజాగా సల్మాన్ ఖాన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది.
By: Tupaki Desk | 13 Dec 2024 5:54 AM GMTబాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో ఓ హీరోయిన్ కలిసి నటిస్తుందంటే చాలా రూమర్లు పుంకాలు పుంకాలుగా వైరల్ అవుతుంటాయి. వాటికి ఛాన్స్ ఇచ్చింది సల్మాన్ ఖాన్. గతంలో ఆయన ఎంతో మంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన ట్రాక్ రికార్డు ఉంది. కొందరు హీరోయిన్ల పట్ల రూడ్ గా ప్రవర్తించాడు అనే విమర్శ కూడా ఆయనపై ఉంది. ఐశ్వర్యా సోమీ అలీ సంగీతా బిజ్లానీ లాంటి భామలు పబ్లిక్ గానే సల్మాన్ దురుసు తనం గురించి చెప్పే ప్రయత్నం చేసారు.
ఇది సల్మాన్ పై ఉన్న నెగిటివిటీ. అలాగే సల్మాన్ ఖాన్ గురించి ఎంతో గొప్పగా..అతడి మనసు చూసిన వారు చెప్పిన వారు చాలా మంది ఉన్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇద్దరు కలిసి జంటగా మురగదాస్ తెరకెక్కిస్తోన్న `సికిందర్` చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. సల్మాన్-రష్మిక మధ్య ఏజ్ గ్యాప్ ఉన్నా అవేం పట్టించు కోకుండా రష్మిక రంగంలోకి దిగింది.
అయితే ఓ కార్యక్రమంలో రష్మిక... సల్మాన్ ఖాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తి. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఎంతో వినయంగా ఉంటారు. `సికిందర్` షూటింగ్ సమయంలో నేను అనారోగ్యానికి గురయ్యాను. అప్పుడు నేను సెట్స్ మీదే ఉన్నాను. నాకు ఒంట్లో బాగా లేదన్న విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ అప్పటికప్పుడు ప్రొడక్షన్ వాళ్లకు చెప్పి ఆరోగ్యకరమైన ఆహారం, వేడి నీళ్లు తెప్పించారు.
ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నారు. ఆ సమయంలో నా పట్ల ఎంతో కేర్ తీసుకున్నారు. ఎవరి నైనా సరే ఆయన తన సొంత మనిషిలా భావిస్తారు. అదే సల్మాన్ ఖాన్ ప్రత్యేకత. దేశంలోనే అతి పెద్ద స్టార్ హీరోల్లో ఆయన ఒకరు. కానీ ఎంతో డౌన్ టూ ఎర్త్ ఉంటారు` అని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. సల్మాన్ ఖాన్ వయసు 58 కాగా , రష్మిక వయసు 28. ఆ జోడీ సికిందర్ లో రొమాంటిక్ సన్నివేశాల్లో సైతం కనిపించనుంది.