సల్మాన్ ఖాన్ పై హత్య కుట్ర కేసులో మరోకరు అరెస్ట్!
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇల్లు ఇప్పుడు భద్రతా సిబ్బంది దిగ్భందనంలో ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 17 Oct 2024 6:22 AM GMTబాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇల్లు ఇప్పుడు భద్రతా సిబ్బంది దిగ్భందనంలో ఉన్న సంగతి తెలిసిందే. ఓ వైపు ముంబై పోలీసులు పహారా..మరోవైపు సల్మాన్ ఖాన్ వ్యక్తిగత రక్షణ సిబ్బంది పహారాతో సల్మాన్ ఇంటి పరిసరాలకు కూడా వెళ్లే పరిస్థితి లేదు. మరోవైపు గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్ కోసం చుట్టు ప్రక్కల ప్రాంతాలన్నింటిని పోలీసులు జల్లెడ పడుతున్నారు.
తాజాగా సల్మాన్ హత్య కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కోంటోన్న మరో వ్యక్తిని పానిపట్టలో అదుపులోకి తీసు కున్నారు. గురువారం అతడిని కోర్టు ముందు నవీ ముంబై పోలీసులు ప్రవేశ పెట్టనున్నారు. ఏప్రిల్ 14న సల్మాన్ ఇంటిపై కొంత మంది దుండగలు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. బాంద్రా ప్రాంతంలో గ్యాలెక్సీ అపార్ట్ మెంట్ వద్దకు ఇద్దరు బైక్ పై వచ్చి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
ఈకేసు దర్యాప్తు జరుగుతోన్న సమయంలోనే మరో నటుడిపై హత్యకు కుట్ర జరుగుతుందని పోలీసులు తెలిపారు. పన్వేల్ ఫామ్ హౌస్ దగ్గర్లోని తన ఇంటికి వెళ్తోన్న మార్గంలో దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులోనే తాజాగా మరో అరెస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే కాల్పుల ఘటనపై సల్మాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఘటన జరిగిన రోజు తన ఇంట్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రాంగణం ఎంతటి భయ భ్రాంతులకు గురైందన్న విషయాన్ని వాంగ్మూలంలో పేర్కొన్నారు. దీంతో పోలీసుల విచారణలో ఎన్నో వాస్తవాలు బయట పడ్డాయి. ఈ కేసుకు సంబంధించి 350 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేసారు. పంజాబీ సింగర్ సిద్దూమూసేవాలా హత్య తరహాలోనే సల్మాన్ పై స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు.