Begin typing your search above and press return to search.

అదే నిజ‌మైతే బిష్ణోయ్ గ్యాంగ్ కి స‌ల్మాన్ స‌వాల్ విసిరిట్లే!

అయితే తాజాగా స‌ల్మాన్ ఖాన్ బిగ్ బాస్ హోస్టింగ్ కోసం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. గురువారం అర్దరాత్రి స‌ల్మాన్ బిగ్ బాస్ సెట్ లోకి ప‌టిష్ట భ‌ద్ర‌త మ‌ధ్య అడుగు పెట్టిన‌ట్లు స‌మాచారం.

By:  Tupaki Desk   |   18 Oct 2024 12:13 PM GMT
అదే నిజ‌మైతే బిష్ణోయ్ గ్యాంగ్ కి స‌ల్మాన్ స‌వాల్ విసిరిట్లే!
X

గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ప్ర‌మాదం పొంచి ఉన్న నేప‌థ్యంలో స‌ల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ ల‌కు, బిగ్ బాస్ సీజ‌న్ -18 కంటెస్ట్ చేస్తారా? అన్న సందేహాలు వ్య‌క్త‌మైన సంగ‌తి తెలిసిందే. బిష్ణోయ్ గ్యాంగ్ బాబా సిద్దీఖి ని హ‌త్య చేసిన త‌ర్వాత స‌ల్మాన్ ఖాన్ ఇల్లు దాటి బయ‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. తాను ఉంటోన్న నివాసం ప‌టిష్ట పోలీస్ ప‌హారాలో ఉండ‌టంతో ఆయ‌న కూడా ఇల్లు దాటే ప‌రిస్థితి ఉండ‌ద‌ని వెలుగులోకి వ‌చ్చింది.

క్ష‌మాప‌ణ‌లు చెబితే దిలేస్తామ‌ని..లేదంటే చంపేస్తామంటో తాజాగా మ‌రోసారి బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు వెళ్ల‌డంతో? స‌ల్మాన్ ఇల్లు దాటే అవ‌కాశ‌మే లేద‌ని జోరుగా ప్ర‌చారం సాగింది. అయితే తాజాగా స‌ల్మాన్ ఖాన్ బిగ్ బాస్ హోస్టింగ్ కోసం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. గురువారం అర్దరాత్రి స‌ల్మాన్ బిగ్ బాస్ సెట్ లోకి ప‌టిష్ట భ‌ద్ర‌త మ‌ధ్య అడుగు పెట్టిన‌ట్లు స‌మాచారం. స‌ల్మాన్ కోసం ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన బ‌స ఏర్పాటు చేసార‌ని..అందులోనే స‌ల్మాన్ ఉన్న‌ట్లు వినిపిస్తుంది.

శుక్ర‌వారం 'వీకెండ్ కా వార్' ఎపిసోడ్ పూర్తి చేస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. స‌ల్మాన్ కోసం ప్ర‌త్యేకంగా 60 మంది సె క్యురిటీ సిబ్బంది ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న‌ట్లు స‌మాచారం. 'బిగ్ బాస్' సెట్ లోకి ఎవ‌రూ లోప‌లికి వెళ్ల‌డానికి అనుమ తిలేద‌ని..షోకు సంబంధించిన సిబ్బంది సైతం ఆధార్ కార్డు చూపించిన త‌ర్వాతే సెట్ లోకి అనుమ‌తిస్తున్న‌ట్లు స‌మాచారం.

అలాగే షూట్ మొత్తం పూర్త‌య్యేవ‌ర‌కూ ఎవ‌రూ సెట్ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి కూడా అనుమ‌తి లేదంటున్నారు. మ‌రి స‌ల్మాన్ ఖాన్ నిజంగా సెట్స్ కి వెళ్లారా? ఇదంతా ప్ర‌చార‌మా? అన్న‌ది తేలాల్సి ఉంది. స‌ల్మాన్ షూట్ కి వెళ్తే గ‌నుక బిష్ణోయ్ గ్యాంగ్ ను లైట్ తీసుకుని వాళ్ల‌కు స‌వాల్ విసిరిన‌ట్లే.