అందుకే స్టార్ హీరోకి ఆ పండగంటే అంత ఇష్టం!
సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ అంటే? ఈద్ పండుగ గుర్తొస్తుంది. ప్రతీ ఏడాది ఈద్ సందర్భంగా సల్మాన్ నటించిన సినిమా రిలీజ్ అవ్వడం అన్నది ఓ అనవాయితీగా వస్తుంది
By: Tupaki Desk | 19 Dec 2024 9:30 PM GMTసల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ అంటే? ఈద్ పండుగ గుర్తొస్తుంది. ప్రతీ ఏడాది ఈద్ సందర్భంగా సల్మాన్ నటించిన సినిమా రిలీజ్ అవ్వడం అన్నది ఓ అనవాయితీగా వస్తుంది. దీన్ని సల్మాన్ ఓ సెంటిమెంట్ గా భావిస్తారు. ఆ పండుక్కి రిలీజ్ అయితే సినిమా పక్కాగా హిట్ అవుతుందనే నమ్మకం ఆయనది. గత 15 ఏళ్లగా ఇదే తరహాలా సల్మాన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 2009లో `వాంటెడ్` రిలీజ్ తో ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది.
అటుపై 2010లో `దబాంగ్` బ్లాక్ బస్టర్ అయింది. 2011లో రిలీజ్ అయిన `బాడీగార్డ్`, 2012లో `ఏక్ ధా టైగర్`, 2014 లో `కిక్`, 2015లో `భజరంగీ భాయిజాన్`, 2016లో `సుల్తాన్`, 2017 లో `ట్యూబ్లైట్`, 2018లో `రేస్ 3`, 2019లో `భారత్`, 2019 లో `కిసీకా భాయ్ కిసీజా జాన్` చిత్రాలు ఈద్ సందర్భంగా రిలీజ్ అయి సంచలనాలు నమోదు చేసినవే. ఇలా మొత్తంగా 11 సినిమాలు ఈద్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. దీంతో సల్మాన్ ఖాన్ తప్పకుండా ఈద్ సందర్భంగా ఓ రిలీజ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు.
ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో `సికిందర్` అనే యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటన రోజే రిలీజ్ తేదీ కూడా ప్రకటించారు. 2025 మార్చిలో వచ్చే ఈద్ కే రిలీజ్ చేస్తామని వెల్లడించారు. అందుకు తగట్టు షూటింగ్ ప్రణాళిక వేసుకుని మేకర్స్ ముందుకెళ్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. `దర్బార్` తర్వాత మురగదాస్ సినిమాలు చేయలేదు. అంతకు ముందు చేసిన సినిమాలు సరైన ఫలితాలు ఇవ్వలేదు.
దీంతో `సికిందర్` ని మురగదాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాయ్ కి జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం భారీగా ఉన్నా? భాయ్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో అమ్మడు ఏమాత్రం తగ్గలేదనే టాక్ వినిపిస్తుంది. శ్రీవల్లి ఆన్ స్క్రీన్ పై రొమాంటిక్ పెర్పార్మన్స్ తో హైలైట్ అవుతుందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.