అష్టదిగ్భంధనంలో సల్మాన్ ఖాన్ ఇల్లు!
సల్మాన్ ఖాన్ స్నేహితుడు, బీజేపీ నేత బాబా సిద్దీఖి హత్యతో ముంబై ఒక్కసారిగా అలెర్ట్ అయింది.
By: Tupaki Desk | 16 Oct 2024 5:40 AM GMTసల్మాన్ ఖాన్ స్నేహితుడు, బీజేపీ నేత బాబా సిద్దీఖి హత్యతో ముంబై ఒక్కసారిగా అలెర్ట్ అయింది. బిష్ణోయ్ గ్యాంగ్ సిద్దీఖీ పై తెగబడటంతో నెక్స్ట్ టార్గెట్ సల్మాన్ ఖాన్ కావడంతో? సల్మాన్ ఇల్లు పరిసర ప్రాంతమం తా అష్టదిగ్భంధనంలోకి వెళ్లింది. ప్రభుత్వం కల్పించే భద్రతతో పాటు సల్మాన్ ఖాన్ ప్రయివేట్ సైన్యం చేతుల్లోకి సల్మాన్ ఇల్లు వెళ్లింది. సిద్దీఖి మరణం తర్వాత సల్మాన్ ఖాన్ కి ప్రభుత్వం భద్రతను మరింత పటిష్టం చేసింది.
Y+ సెక్యూరిటీ కల్పించారని తెలుస్తుంది. ప్రస్తుతం సల్మాన్ ఇల్లు పూర్తిగా భద్రతా దళాల ఆధీనంలో ఉంది. ఇంటి వద్ద ఆంక్షలు విధించారు. ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇల్లు ఉండే గెలాక్సీ అపార్ట్మెంట్ కి రోజూ అభిమానులు, మీడియా వాళ్లు వస్తుంటారు. బయట నుంచే సల్మాన్ ఇంటిని వీడియోలు తీయడం.. .సెల్పీలు దిగడం వంటివి చోటు చేసుకుంటాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పోలీసులు ఆంక్షలు విధించారు.
ఎవరూ అటువైపు గా వెళ్లడానికి వీలు లేదని ఆంక్షలు పెట్టారు. మీడియాకి కూడా ఎలాంటి ఎంట్రీ లేదు. కవరేజ్ ఏదైనా సరే భద్రత దళాలు దాటుకుని రావడానికి వీలు లేదని కఠిన ఆంక్షలు తీసుకొచ్చింది. సల్మాన్ ఇంట్లోకి కూడా ఏ ఒక్కరిని వెళ్లనివ్వలేదు. కుటుంబ సభ్యులకు బాగా తెలిసిన వారు తప్ప ఇంకెవరికీ అనుమతి లేదు. పోలీసులకు అనుమానదాస్పదంగా ఎవరు కనిపించినా పట్టుకుని విచారిస్తున్నారు.
కుటుంబ సభ్యులు సహా సల్మాన్ ఖాన్ ఇంటికే పరిమితమయ్యారు. మొత్తంగా సల్మాన్ ఇల్లు ఇప్పుడు అష్టదిగ్భంధనంలోనే ఉందన్నది క్లియర్ గా అర్దమవుతుంది. ఇప్పటికే ఓ మాజీ బీజేపీ నేత సల్మాన్ ఖాన్ చేసింది తప్పుగా అభివర్ణించి బిష్ణోయ్ వర్గానికి క్షమాపణలు చెప్పాల్సిందిగా తన సలహాగా పేర్కొన్న సంగతి తెలిసిందే.