Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ మూవీలో సల్మాన్ ఖాన్‌... ఇదిగో పూర్తి వివరాలు

కనుక వార్‌ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ అడగడమే ఆలస్యం వెంటనే సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   11 Oct 2024 5:51 AM GMT
ఎన్టీఆర్‌ మూవీలో సల్మాన్ ఖాన్‌... ఇదిగో పూర్తి వివరాలు
X

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలు ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్‌లుగా నటించడం చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌లు ఎక్కువగా ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్‌ రోల్స్ లో కనిపించడం ద్వారా ఫ్యాన్స్ ను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం హృతిక్‌ రోషన్‌ హీరోగా రూపొందుతున్న వార్‌ 2 లోనూ సల్మాన్‌ ఖాన్‌ కీలకమైన గెస్ట్‌ రోల్‌ లో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో టాలీవుడ్‌ యంగ్ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ సైతం నటిస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ నటిస్తున్న మొదటి బాలీవుడ్‌ మూవీ వార్ 2 అనే విషయం తెల్సిందే.

ఇప్పటికే హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ ల వార్‌ 2 షూటింగ్‌ దాదాపుగా సగం పూర్తి అయింది అంటూ హిందీ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. కానీ నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్ ఫిల్మ్స్‌ వారు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న వార్‌ 2 లో సల్మాన్ ఖాన్ కీలకమైన గెస్ట్‌ అప్పియరెన్స్ ఇవ్వడం ద్వారా సినిమా స్థాయి అమాంతం పెరుగుతుందని అంటున్నారు. అండర్ వలర్డ్‌ స్పై గా సల్మాన్ కనిపించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. వార్‌ 2 లో సల్మాన్ ఖాన్‌ పాత్ర గురించి మరింత క్లారిటీ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎదురు చూడాల్సి ఉంది.

అయాన్ ముఖర్జీ తో సల్మాన్ ఖాన్‌ కి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే టాక్‌ ఉంది. కనుక వార్‌ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ అడగడమే ఆలస్యం వెంటనే సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కనుక వార్‌ 2 లో సల్మాన్‌ ఖాన్ నటించే విషయంలో వస్తున్న వార్తలు పుకార్లు అయ్యే అవకాశం తక్కువ. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ తోనూ సల్మాన్‌ ఖాన్ కి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కనుక బాలీవుడ్‌ లో ఈ అరుదైన కాంబో ను ప్రేక్షకులు అతి త్వరలోనే చూడబోతున్నారు. అందుకు సంబంధించిన చర్చలు మొదలు అయ్యాయి.

ఇక ఎన్టీఆర్‌ సినిమాల విషయానికి వస్తే ఇటీవల దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొరటాల శివ దర్శకత్వంలో పండుగ ముందు వచ్చిన దేవర సినిమా పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకుంది. అంతే కాకుండా సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. దాదాపుగా రూ.500 కోట్ల వసూళ్లను దేవర సాధించింది అనే వార్తలు వచ్చాయి. ఇక వార్‌ 2 కోసం ఎన్టీఆర్‌ సిద్ధం అవుతున్నాడు. హృతిక్ రోషన్ తో ఒక పాటతో పాటు కీలక సన్నివేశాలు, యాక్షన్‌ సీన్స్‌ లో ఎన్టీఆర్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారు. గతంలో టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవితో సల్మాన్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు, వార్‌ 2 లో ఎన్టీఆర్‌, సల్మాన్‌ స్క్రీన్ షేర్ చేసుకుంటారేమో చూడాలి.