Begin typing your search above and press return to search.

కాళ్లు చాపినంత మాత్రాన నేను పుడింగ్ ని కాదు!

అంటే ఇక్క‌డ కాల‌ర్ ఎగ‌రేయ‌డానికి కోట్ల‌తో సంబంధం లేదు.

By:  Tupaki Desk   |   26 Nov 2024 12:30 AM GMT
కాళ్లు చాపినంత మాత్రాన నేను పుడింగ్ ని కాదు!
X

స‌మాజంలో మ‌నుషులు ర‌క‌ర‌కాలు. డ‌బ్బు, ప‌ర‌ప‌తి, హోదాలాంటివి మ‌నిషి తీరులో మార్పులు తెస్తాయి అంటారు. అలాగ‌ని అంద‌రి తీరులోనూ ఆ మార్పులుండ‌వు. కోట్లు ఉన్నాయ‌ని కాల‌ర్ ఎగ‌రేసినొడు ఉన్నాడు. అవే కోట్లు ఉన్నాయ‌ని త‌ల‌దించుకుని వెళ్లిపోయే వాళ్లు ఉన్నారు. ఆ కోట్లు లేని వాళ్లు కూడా కాల‌రెగ‌ర‌స్తారు. అంటే ఇక్క‌డ కాల‌ర్ ఎగ‌రేయ‌డానికి కోట్ల‌తో సంబంధం లేదు. మ‌నిషి యొక్క వ్య‌క్తిత్వం..స్వ‌భావాన్ని బ‌ట్టి ఉంటుంది.


తాజాగా బిగ్ ఆస్ సీజ‌న్ 18 సాక్షిగా సల్మాన్ ఖాన్ ఒక‌ప్ప‌టి త‌న తీరును ఓ కంటెస్టెంట్ తోపంచుకున్నాడు. అక్కడ చెప్పాల్సిన సంద‌ర్భం రావ‌డంతో స‌ల్మాన్ ఓపెన్ అయ్యాడు. ఎవ‌రైనా ఉన్న‌ప్పుడు ద‌ర్జాగా టేబుల్ పై కాళ్లు పెట్టి మాట్లాడ‌టం త‌ప్పు అని ఆ యాటిట్యూడ్ మార్చుకోవాల‌ని స‌ల్మాన్ హిత‌వు ప‌లికాడు. తాను కూడా ఒక‌ప్పుడు రూడ్ గా ఉండేవాడిని...దానికి సంబంధించిన ఉదాహ‌ర‌ణ గుర్తు చేసాడు.

`టేబుల్ పై కాళ్లు చాపి కూర్చోవ‌డం నాకు కూడా అల‌వాటు. గ‌తంలో పోలీస్ స్టేష‌న్ కి వెళ్లిన త‌ర్వాత అలాగే కూర్చున్నాను. నేను ఏ త‌ప్పు చేయ‌న‌ప్పుడు ఎందుకు భ‌య‌ప‌డాలి? అన్న‌ట్లే ఉండేవాడిని. కానీ ఎవ‌రైనా సీనియ‌ర్ అధికారులు బ్యాడ్జ్ ధ‌రించిన‌ప్పుడు లేచి గౌర‌వించాలి. ఆ పాత క్లిప్పింగ్ ఇప్పుడు చూసిన‌ప్పుడు గ‌ర్వంగా ఫీల‌వ్వ‌ను. అంత పొగ‌రుగా కూర్చోవాల్సిన అవ‌స‌రం ఏముంది? అనుకుంటాను. పోలీసుల్ని అగౌర‌ప‌రిచేలా అంత అహంకారం దేనికి? ఎందుకు అలా ప్ర‌వ‌ర్తించాను అనిపిస్తుంది.

ఇప్పుడు ఎంత బాధ‌ప‌డినా ఆ పాత సంఘ‌ట‌న మార్చ‌లేను. నా కార‌ణంగా వాళ్లంతా ఎంతో బాధ‌ప‌డి ఉంటారు. ఇప్పుడు నీపై కూడా అంతే రూడ్ గా మాట్లాడ‌వ‌చ్చు. నీకంటే నా గొంతు ఇంకా పెద్ద‌ది. కానీ నేను అలా అర‌వాల‌నుకో వ‌డం లేదు` అని అన్నారు. అలా నాటి స‌ల్మాన్..నేటి స‌ల్మాన్ మ‌ధ్య వ్య‌త్యాసాన్ని బ‌య‌ట పెట్టారు.