34 లక్షల ఖరీదు 'రామమందిరం' డిజైన్ వాచ్ ధరించిన సల్మాన్
లగ్జరీ కార్‌లు కొనడంలోనే కాదు లగ్జరీ వాచ్‌లను కొనడంలోను సల్మాన్ భాయ్ అభిరుచి నిరంతరం చర్చల్లోకొస్తుంది.
By: Tupaki Desk | 27 March 2025 3:06 PMలగ్జరీ కార్‌లు కొనడంలోనే కాదు లగ్జరీ వాచ్‌లను కొనడంలోను సల్మాన్ భాయ్ అభిరుచి నిరంతరం చర్చల్లోకొస్తుంది. త్వరలో రిలీజ్ కి వస్తున్న `సికందర్` చిత్రం ప్రమోషన్ సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ జాకబ్ & కో. ఎపిక్ ఎక్స్ రామ్ జన్మభూమి టైటానియం ఎడిషన్ 2 వాచ్‌ను ధరించి కనిపించాడు. దీని విలువ రూ. 34 లక్షలు. అద్భుతమైన డిజైన్ ఆకర్షణీయమైన హస్తకళతో కూడిన ఈ వాచ్ వెంటనే అభిమానులు, ఫ్యాషన్ ఔత్సాహికుల దృష్టిని ఆకర్షించింది.
జాకబ్ & కో వ్యవస్థాపకుడు- ఛైర్మన్ జాకబ్ అరాబోతో సల్మాన్ కుటుంబానికి గొప్ప అనుబంధం ఉంది. కొన్నేళ్లుగా ఈ కంపెనీ వాచ్ లను భాయ్ ధరిస్తూ కావాల్సిన ప్రమోషన్ చేస్తూనే ఉన్నాడు. అతడు తన సినిమాల ద్వారా ఈ బ్రాండ్ కి ప్రచారం చేస్తున్నాడు. అయితే జాకబ్ అండ్ కో కంపెనీ అధినేతతో సల్మాన్ బంధం కేవలం బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లకు పరిమితం కాదు. ఆ ఇద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్.
జాకబ్ తండ్రి సల్మాన్ కు ఒక కానుకను ఇచ్చాడు. ది వరల్డ్ ఈజ్ యువర్స్ థీమ్ తో ఇది ఎంతో ఆకర్షణీయమైనది. అప్పటి నుంచి వారి బంధం మరింత బలపడింది. సల్మాన్ జీవితంపై శాశ్వత ప్రభావాన్ని చూపించిన అతడి తండ్రి సలీంఖాన్ ని గౌరవించే ఒక ప్రత్యేకమైన టైమ్‌పీస్‌ను రూపొందించడంలోను జాకబ్ అండ్ కో సహకరించింది. సల్మాన్ కోసం, అతడి తండ్రి కోసం ప్రత్యేకమైన వాచ్ లను ఈ కంపెనీ తయారు చేసి అందిస్తుంది.
సల్మాన్ ఖాన్ తదుపరి చిత్రం `సికందర్` కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భాయ్ మరో పవర్ ప్యాక్డ్ పెర్ఫామెన్స్ తో రక్తి కట్టించబోతున్నాడని భావిస్తున్నారు. ఏ.ఆర్.మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.