Begin typing your search above and press return to search.

అమ్మా నాన్న విడాకుల‌లో న‌లిగిపోయాడు.. స్టార్ హీరో ఆవేద‌న‌!

పెళ్లి చేసుకున్న ఇద్ద‌రు సోద‌రులు విడాకుల‌తో ఒంట‌రి అయ్యారు.

By:  Tupaki Desk   |   12 Feb 2025 2:30 AM GMT
అమ్మా నాన్న విడాకుల‌లో న‌లిగిపోయాడు.. స్టార్ హీరో ఆవేద‌న‌!
X

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లికి దూరంగా ఉన్నాడు. పెళ్లి చేసుకున్న ఇద్ద‌రు సోద‌రులు విడాకుల‌తో ఒంట‌రి అయ్యారు. ఆర్భాజ్ ఇటీవ‌లే త‌న మేక‌ప్ ఉమెన్ ని పెళ్లాడాడు. అదంతా అటుంచితే ఆర్భాజ్ ఖాన్ - మ‌లైకా అరోరా జంట‌కు జ‌న్మించిన అర్హాన్ ఖాన్ త‌న త‌ల్లిదండ్రులు విడిపోవ‌డంతో చాలా స్ట్ర‌గుల్ అయ్యాడ‌ని స‌ల్మాన్ ఖాన్ తాజా పాడ్ కాస్ట్ లో చెప్పిన విధానం హృద‌యాల‌ను క‌ల‌చివేసింది.

అర్హాన్ ఖాన్ యూట్యూబ్ పాడ్ కాస్ట్ `డంబ్ బిర్యానీ`లో స‌ల్మాన్ చాలా ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను మాట్లాడాడు. అత‌డు అర్బాజ్ ఖాన్ - మలైకా అరోరాల విడాకుల అంశాన్ని క్లుప్తంగా ప్రస్తావించాడు. అర్హాన్ ఇప్పటికే సవాళ్లను ఎదుర్కొన్నాడని అన్నాడు. తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత అర్హాన్ తన జీవితాన్ని స్వయంగా ముందుకు సాగించాల‌ని, తన సొంత‌ కుటుంబాన్ని నిర్మించుకోవలసి ఉంటుందని స‌ల్మాన్ అభిప్రాయ‌ప‌డ్డాడు. అర్హాన్ ఒడిదుడుకుల‌పై స‌ల్మాన్ ఆందోళ‌న వ్య‌క్తం చేసాడు. అమ్మా నాన్న విడిపోయాక‌, నువ్వే దానిని స‌రి చేసుకోవాలి అని సూచించారు. నీకంటూ ఒక సొంత‌ కుటుంబం కోసం కొంత‌ పని చేయాలి. కుటుంబంతో కలిసి భోజనం, విందు ఆర‌గించే సంస్కృతి ఎల్లప్పుడూ ఉండాలి. ఎప్పుడూ కుటుంబ పెద్ద ఉండాలి.. అతడిని గౌరవించాలి`` అని స‌ల్మాన్ సూచించాడు.

అర్బాజ్ - మలైకా 1998లో వివాహం చేసుకున్నారు. దాదాపు 20 సంవత్సరాల సంసారం తర్వాత 2017లో విడిపోయారు. వారి కుమారుడు అర్హాన్ 2002లో జన్మించాడు. అర్హాన్ ఖాన్ ని క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం చేసే బాధ్య‌త స‌ల్మాన్ ఖాన్ పైనే ఉంది.