Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరోకి పెద్ద అన్యాయ‌మే జ‌రిగిందే!

షారుక్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో అబ్బాస్ -మ‌స్తాన్ తెర‌కెక్కించిన `బాజీగ‌ర్` అప్ప‌ట్లో ఎలాంటి విజ‌యం సాధించిందో చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   12 Oct 2024 5:24 AM GMT
ఆ స్టార్ హీరోకి పెద్ద అన్యాయ‌మే జ‌రిగిందే!
X

షారుక్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో అబ్బాస్ -మ‌స్తాన్ తెర‌కెక్కించిన `బాజీగ‌ర్` అప్ప‌ట్లో ఎలాంటి విజ‌యం సాధించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. షారుక్ కెరీర్ ల ఇదొక మైల్ స్టోన్ మూవీ. ఇందులో విక్కీ మ‌ల్హోత్రా అనే నెగిటివ్ పాత్ర‌లో షారుక్ పెర్మార్మెన్స్ తో అద‌ర‌గొట్టాడు. సినీ ప్రియులు, విమ‌ర్శ‌కులు అంతా ఫిదా అయ్యారు. షారుక్ కెరీర్ లో ది బెస్ట్ పాత్ర‌గా ఇప్ప‌టికీ చెబుతుంటారు. అయితే ఈ పాత్ర‌లో న‌టించాల్సిన న‌టుడు షారుక్ కాదు. ముందుగా ఆ అవ‌కాశం స‌ల్మాన్ ఖాన్ కి వ‌చ్చింది అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఈ విష‌యాన్నిస్వ‌యంగా స‌ల్మాన్ ఖాన్ రివీల్ చేసాడు. `నాకు బాజీగ‌ర్ క‌థ బాగా న‌చ్చింది. కానీ కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి ప్ర‌తినాయ‌కుడి పాత్రలో న‌టించాల‌నిపించ‌లేదు. అందుకే ఎమ‌ష‌న‌ల్ గా ఉంటుంద‌ని త‌ల్లి సెంటిమెంట్ ని జోడించ‌మ‌ని అడిగాను. కానీ అబ్బాస్-మ‌స్తాన్ మాత్రం అప్పుడు ఏం మాట్లాడ‌లేదు. అలా చాలా చ‌ర్చ‌ల త‌ర్వాత ఈచిత్రం నుంచి త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాను. కానీ ఈసినిమా పూర్త‌యిన త‌ర్వాత రోజు ద‌ర్శ‌కుడు నాకు ఫోన్ చేసి మీరు చెప్పిన ఆ త‌ల్లి పాత్ర ఆలోచ‌న ఇందులో జోడించాం.

దానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మాకు ఇలాంటి ఐడియా ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు. ఇందులో షారుక్ ఖాన్ ని తీసుకున్నార‌ని నాకు ఎలాంటి బాధ‌లేదు. ఆరోజు నేను తిర‌స్క‌రించిన చిత్ర‌మే ఇది. షారుక్ ఖాన్ కి స్టార్ డ‌మ్ తెచ్చిపెట్టినందుకు నాకు చాలా సంత‌షంగా ఉంటుందని ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు` స‌ల్మాన్. కానీ మేక‌ర్స్ స‌ల్మాన్ ఐడియాని విగియోగించుకోవ‌డం అన్న‌ది ఎంత వర‌కూ భావ్యం? అన్న‌ది నెటి జ‌నుల్లో చ‌ర్చ‌కొస్తుంది.

ఆయ‌న ఇచ్చిన ఐడియా వాళ్ల‌కు స‌ల్మాన్ ప్రాజెక్ట్ లో ఉన్నంత సేపు గుర్తు రాలేదా? బ‌య‌ట‌కు వెళ్లిన త‌ర్వాతే గుర్తొచ్చిందా? ఇది ఓ ర‌కంగా స‌ల్మాన్ ఖాన్ ని చీటింగ్ చేసిన‌ట్లే అంటూ కొంద‌రి అస‌హనం వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ హీరోగా ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా `సికంద‌ర్` తెర‌కెక్కు తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ స‌ల్మాన్-ముర‌గ‌దాస్ జోడీ క‌డుతున్నారు. ఇందులో స‌ల్మాన్ కి జోడీగా ర‌ష్మికా మంద‌న్న నటిస్తోంది.