సల్మాన్ సికందర్.. ఇదేం ట్విస్ట్ సామీ..!
సౌత్ డైరెక్టర్ ఏ.ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో బాలీవుడ్ యాక్షన్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సికందర్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద సల్మాన్ ఖాన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు.
By: Tupaki Desk | 23 Feb 2025 1:00 PM GMTసౌత్ డైరెక్టర్ ఏ.ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో బాలీవుడ్ యాక్షన్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సికందర్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద సల్మాన్ ఖాన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కొన్నాళ్లుగా సరైన ఫాం లో లేని బాధ్షా షారుఖ్ కూడా వరుస హిట్లు కొట్టి ట్రాక్ ఎక్కేశాడు. ఇక ఇప్పుడు సల్మాన్ వంతు వచ్చింది. సల్మాన్ ఖాన్ ఒకప్పటి సక్సెస్ మేనియా కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.
అందుకే బాలీవుడ్ డైరెక్టర్స్ తో కాకుండా ఈసారి సౌత్ దర్శకుడి మీద నమ్మకం పెట్టుకున్నాడు. మురుగదాస్ టేకింగ్, డైరెక్షన్ అంతా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఐతే దురదృష్టవశాత్తు డైరెక్టర్ గా ఆయన కూడా ఏమాత్రం ఫాం లో లేరు. అందుకే సల్మాన్, మురుగదాస్ సినిమాపై ఎలాంటి బజ్ లేదు. ఈ సినిమాకు ఒకే ఒక్క మ్యాజిక్ ఉంది అంటే అది రష్మిక మందన్న నటించడమే. బాలీవుడ్ లో రష్మిక హవా గురించి ఎంత చెప్పినా తక్కువే.
అమ్మడు అక్కడ వరుస హిట్లతో దూసుకెళ్తుంది. రణ్ బీర్ కపూర్ తో యానిమల్, విక్కీ కౌశల్ తో చావా సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న రష్మిక సల్మాన్ ఖాన్ కి లక్ తెస్తుందా లేదా అన్నది చూడాలి. ఐతే ఈ సినిమాను మార్చి 30న రిలీజ్ లాక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మార్చి 30 అంటే ఆదివారం.. ఆరోజు ఎందుకంటే 31న పండగ ఉంది. సో రంజాన్ ఫెస్టివల్ కలిసి వస్తుందని అలా ప్లాన్ చేశారు.
ఐతే అసలైతే ఫ్రైడే రిలీజ్ చేస్తే నాలుగు రోజులు వీకెండ్ కలిసి వచ్చేలా ఉంటుంది. కానీ సినిమా హిట్ టాక్ తెస్తే బెటరే కానీ నిరాశపరిస్తే కనీసం ఫెస్టివల్ టైం లో వచ్చే వసూళ్లు కూడా ఉండవని భావిస్తున్నారు. అందుకే సల్మాన్ సికందర్ సినిమాను మార్చి 30న రిలీజ్ అనుకుంటున్నారు. ఐతే ప్రస్తుతం ఒక సినిమా తీయడం కన్నా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడమే ఎక్కువ ఇంపార్టెంట్ అనిపిస్తుంది.
మార్చి 30 రిలీజ్ అంటే నెల రోజులు మాత్రమే ఉంది ఈలోగా సినిమా మీద ఆడియన్స్ లో ఒక ఇంపాక్ట్ కలిగేలా చేయాలి. సల్మాన్, రష్మిక మొదటిసారి జత కడుతున్న సికందర్ సినిమాలో ఈ జోడీ అలరిస్తుందని అంటున్నారు. సల్మాన్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. మరి సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.