Begin typing your search above and press return to search.

సల్లూ 'సికిందర్‌' కోసం శ్రీవల్లి, చందమామ

ఇటీవల ఒక షెడ్యూల్‌ లో కాజల్‌ అగర్వాల్‌ పాల్గొనగా, తాజా షెడ్యూల్‌ లో సల్మాన్‌ ఖాన్‌ తో కలిసి రష్మిక ఆడి పాడింది.

By:  Tupaki Desk   |   14 Sep 2024 7:51 AM GMT
సల్లూ సికిందర్‌ కోసం శ్రీవల్లి, చందమామ
X

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్ హీరోగా తమిళ స్టార్‌ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో 'సికందర్‌' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ ను పక్కా కమర్షియల్‌ హీరోగా చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌ గా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుందని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో నటిస్తుందని క్లారిటీ వచ్చింది. మొత్తంగా సల్మాన్‌ ఖాన్ కి జోడీగా సికందర్ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు అదీ మన సౌత్ హీరోయిన్స్‌ నటిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ లో వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం నిరాశ పరుస్తున్నాయి. హిందీలో సక్సెస్ రేటు చాలా తక్కువ ఉన్న సమయంలో మురుగదాస్‌ తో సల్మాన్‌ ఖాన్‌ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ లో సౌత్ దర్శకులు చేసిన సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా తమిళ్‌ దర్శకుడు అట్లీ చేసిన జవాన్ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ హీరోగా జవాన్‌ సినిమా దాదాపు వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి రికార్డ్‌ బ్రేక్ చేసింది.

చాలా కాలంగా సల్మాన్ ఖాన్ కి సరైన బాక్సాఫీస్ హిట్ దక్కలేదు. ఇలాంటి సమయంలో ఆయన మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా బాక్సాఫీస్ వద్ద రికార్డ్‌ బ్రేకింగ్ వసూళ్లు సాధించే విధంగా పక్కా కమర్షియల్‌ సినిమాను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను నడియాడ్‌ వాలా నిర్మిస్తున్నాడు. కాజల్‌ అగర్వాల్ పెళ్లి తర్వాత కాస్త సినిమాల్లో సందడి తగ్గింది. బాలీవుడ్ లో గతంలో సినిమాలు చేసిన కాజల్ మళ్లీ ఈ సినిమా తో రీ ఎంట్రీకి సిద్ధం అయింది. రష్మిక బ్యాక్ టు బ్యాక్ హిందీ సినిమాల్లో నటిస్తోంది.

ఇటీవల ఒక షెడ్యూల్‌ లో కాజల్‌ అగర్వాల్‌ పాల్గొనగా, తాజా షెడ్యూల్‌ లో సల్మాన్‌ ఖాన్‌ తో కలిసి రష్మిక ఆడి పాడింది. సల్మాన్‌ ఖాన్‌ తో నటిస్తున్న రష్మిక మందన్న మరో వైపు అల్లు అర్జున్ కి జోడీగా పుష్ప 2 లో నటిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ 6న పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంకా రెండు లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో కూడా రష్మిక నటిస్తోంది. కాజల్ మాత్రం తెలుగు లో ఒక్క సినిమా చేస్తోంది. ఆ సినిమాతో పాటు మరో సినిమా కూడా చర్చల దశలో ఉంది. కాజల్ అగర్వాల్‌ ఇప్పుడు హిందీలో సల్మాన్‌ కు జోడీగా నటిస్తున్న నేపథ్యంలో మళ్లీ బిజీగా మారే అవకాశాలు ఉన్నాయి.